ఏమ్మా అన్విక, రణ్వీర్ గారు నీకు నచ్చలేదా,లేక మన స్థాయి కాదని భయపడుతున్నావా, ఆయన బంగారం లాంటి మనిషి తల్లీ అని శ్రీనివాస్ గారు శాంతంగా అడిగారు.
అన్విక ఇక ఆగలేకపోయింది. నాన్న కాళ్ల మీద పడి వెక్కి వెక్కి ఏడ్చింది. నాన్న.. నాకు ఆయనంటే ఇష్టమే. కానీ ఆ ఇష్టమే మన కొంప ముంచుతుంది నాన్న.మీకు ఆ రోజు యాక్సిడెంట్ అయింది కదా,
అది యాక్సిడెంట్ కాదు నాన్న, రణ్వీర్ శత్రువులు కావాలని చేయించారు. మీరు హాస్పిటల్‌లో ఉన్నప్పుడు ఒక అజ్ఞాత వ్యక్తి వచ్చి నన్ను బెదిరించాడు.
నేను రణ్వీర్ కి దూరంగా ఉండకపోతే మిమ్మల్ని, అమ్మని చంపేస్తామని హెచ్చరించాడు. రణ్వీర్ సామ్రాజ్యం చుట్టూ శత్రువులు ఉన్నారు నాన్న..
నేను ఆ ఇంటికి వెళ్తే నా వల్ల మీ ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. నాకు మీరు ముఖ్యం నాన్న.. ఆ పెళ్లి వద్దు అని అన్విత చెప్పిన మాటలకు శ్రీనివాస్ గారు విని స్తంభించిపోయారు.
తన కూతురు ఇంత మానసిక వేదన అనుభవిస్తోందని ఆయన ఊహించలేదు. తన యాక్సిడెంట్ వెనుక ఇంత పెద్ద కుట్ర ఉందా.