అది కేవలం ముద్దు కాదు, ఆమెపై తనకున్న అధికారాన్ని, మొండి ప్రేమని చాటే ఒక సంతకం.
అన్విక మొదట ప్రతిఘటించినా,అతని స్పర్శలో ఉన్న తీవ్రతకు నెమ్మదిగా నిశ్శబ్దమైపోయింది.
కారు బయట లోకం ఆగిపోయినట్టు అనిపించింది. రణ్వీర్ కౌగిలిలో ఆమెకు భయం ఉన్నా, ఒక తెలియని రక్షణ కవచం ఉన్నట్టు అనిపించింది.
కాసేపటి తర్వాత ఆమెను వదులుతూ, ఆమె నుదుటిపై నుదురు ఆనించి, గుర్తుంచుకో నువ్వు నా దాన్నివి,నీ మీద ఈ రణ్వీర్ ముద్ర పడింది.
ఇక ఏ వ్యక్తి కూడా నీ పక్కన నిలబడటానికి కూడా సరిపోడు అని తీవ్రమైన స్వరంతో అన్నాడు.
అన్విక ఊపిరి తీసుకోవడం కూడా మర్చిపోయి అలాగే అతని కళ్లలోకి చూస్తూ ఉండిపోయింది.కారులో ఆ నిశ్శబ్ద యుద్ధం ముగిసింది.
రణ్వీర్ తన ముద్రను అన్విక పై వేసి, ఆమె మనసును, శరీరాన్ని తన ఆజ్ఞకు లొంగదీసుకున్నాడు. కారు అన్విక ఇంటి వీధి చివరన ఆగింది.