రణ్వీర్ అన్విక వైపు చూశాడు. ఆమె కళ్లు ఎర్రబడి ఉన్నాయి. రణ్వీర్ తన దగ్గరికి వెళ్లి, అన్వికా.. నువ్వు చెప్పు, నీకు నేను కావాలా అని అందరి ముందు అడిగాడు.
అన్విక వణుకుతున్న గొంతుతో, అవును.. నాకు మీరు కావాలి అని చెప్పింది.రణ్వీర్ గట్టిగా నవ్వి, చూశావా అమ్మా.. ప్రేమ ఎంతటి వాడినైనా లొంగదీస్తుంది.
శ్రీనివాస్ గారు, మీరు అడిగారు కాబట్టి నేను ఒప్పుకుంటున్నాను అని రన్వీర్ అంటాడు. ఆ మాట విన్న దేవి గారు అన్విక దగ్గరికి వెళ్లి,
చాలా సంతోషం తల్లినువ్వు పెళ్లికొప్పుకోవడం. త్వరలోనే నేను ముహూర్తాలు పెట్టి కబురు పంపుతాను అని శ్రీనివాస్ గారికి వాసవి గారికి చెప్తారు.
దాంతో వాసవి గారు శ్రీనివాస్ గారు వెళ్లి వస్తామని చెప్పి అన్వికా ను తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతారు.
రణ్వీర్ తన ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళాడు. అక్కడ సిద్ధార్థ్ ఒక వీడియో ప్లే చేశాడు.సార్ మనం శ్రీనివాసరావు గారి సమస్యలు తీర్చాం కానీ, జగ్గర్ మనుషులు ఇంకా అన్విక ఇంటి మీద నిఘా పెట్టారు.