అన్విక తన బెడ్ మీద పడుకుని పైకప్పు వైపు చూస్తోంది. ఆమెకు రణ్వీర్ కళ్లు, ఆ ముద్దు, ఆ రక్తపు మరకలు మాత్రమే కనిపిస్తున్నాయి.
ఆ రాత్రి బాల్కనీలో జరిగిన ఆ భయంకరమైన సంఘటన తర్వాత అన్వికకు నిద్ర పట్టలేదు. రణ్వీర్ తన కళ్లముందే ఒక మనిషిని అంతం చేయడం ఆమె కళ్లముందు కదలాడుతూనే ఉంది.
మరుసటి రోజు ఉదయం రణ్వీర్ ఆమెను బయటకు తీసుకెళ్తానని చెప్పిన మాట గుర్తొచ్చి, ఆమె భయం భయంగానే నిద్రలేచింది.
ఉదయం ఎనిమిది గంటలకే అన్విక ఫోన్‌కు రణ్వీర్ నుంచి మెసేజ్ వచ్చింది.అన్వికా నిన్ను ఇవాళ బయటకు తీసుకెళ్తానని చెప్పాను కదా,
కానీ ఆఫీస్ కు సంబంధించిన ఒక అర్జెంట్ ఇంటర్నేషనల్ బిజినెస్ మీటింగ్ ఉంది. సో, ఇవాళ మనం కలవడం కుదరదు. కానీ నీ కోసం ఒక సర్ప్రైజ్ వేచి ఉంది. – రణ్వీర్
అన్విక ఆ మెసేజ్ చూసి ఊపిరి పీల్చుకుంది. ప్రస్తుతానికి అతని కళ్లలో పడకుండా తప్పించుకున్నందుకు ఆమెకు కొంచెం రిలీఫ్ అనిపించింది.