సామ్రాట్ యూనివర్సిటీ గేటు దాటగానే అన్విక మనసులో ఒక తెలియని ప్రశాంతత అలుముకుంది.
గత కొన్ని రోజులుగా తన చుట్టూ ఉన్న టెన్షన్, భయం, రణ్వీర్ పట్ల ఉన్న సందిగ్ధత..
వీటన్నింటినీ తన గదిలోనే వదిలేసి వచ్చినట్లు అనిపించింది. ఆమె పక్కన తన ప్రాణ స్నేహితురాలు శ్రావణి, అల్లరి పిల్లకు ప్రతిరూపమైన ఆడపడుచు అనిత, మరియు ఎప్పుడూ సరదాగా ఉండే రాహుల్ ఉన్నారు.
ఈ నలుగురి గ్యాంగ్ కాలేజీలో అడుగుపెట్టగానే వాతావరణమే మారిపోయింది.
కాలేజీ కారిడార్లలో నడుస్తుంటే అన్వికకు తన పాత రోజులు గుర్తొచ్చాయి. శ్రావణి అన్విక చేతిని పట్టుకుని, ఏయ్ అన్వికా ఇక చాలు ఆ సీరియస్ ఫేస్.
ఇక్కడ నువ్వు సామ్రాట్ ఇంటి కోడలివి కాదు, కేవలం మా అన్వికవి మాత్రమే.