హైదరాబాద్ నగరం ఆ రోజు ఒక వింతైన నిశ్శబ్దంతో నిద్రలేచింది. కానీ సామ్రాట్ ప్యాలెస్‌లో మాత్రం ఒక భయంకరమైన తుఫాను ముంచుకొస్తోంది.
రణ్వీర్ తన జిమ్ రూమ్‌లో పంచ్ బ్యాగ్‌ను బాదుతుంటే, అతని చేతి కండరాలు ఉబికి వస్తున్నాయి.
ఒక్కొక్క దెబ్బకు ఆ బ్యాగ్ చిరిగిపోయేలా ఉంది. అన్వికను ఆ ప్రొఫెసర్ ఆర్యన్ తాకాలని చూశాడన్న వార్త రణ్వీర్ను నిద్రపోనివ్వడం లేదు.
జిమ్ ముగించుకుని రణ్వీర్ గదిలోకి వచ్చేసరికి అన్విక అద్దం ముందు నిలబడి ఏడుస్తోంది. రణ్వీర్ వెళ్ళి ఆమె భుజాల మీద చేతులు వేశాడు. అన్విక ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగింది.
ఎందుకు అన్వీ? ఎందుకు నాకు చెప్పలేదు? అని రణ్వీర్ గొంతులో ఒక రకమైన ఆవేదన వినిపించింది.
అన్విక తల దించుకుని చెబితే మీరు మళ్ళీ నన్ను బంధిస్తారని భయం వేసింది రణ్వీర్ గారు.
నా చదువు ఆగిపోతుందని భయపడ్డాను అని వెక్కి వెక్కి ఏడ్చింది.రణ్వీర్ ఆమెను దగ్గరకు తీసుకుని,నీ చదువు కంటే నీ ఆత్మగౌరవం ముఖ్యం అన్వీ.