వర్మస్ ప్యాలెస్‌లో రాత్రి నిశ్శబ్దం అలుముకుంది. గాలిలో పరిమళం నెమ్మదిగా వీస్తోంది. అందరూ భోజనాలు ముగించి నిద్రకు ఉపక్రమించినా, రణ్వీర్ గదిలో మాత్రం ఇంకా వెలుగు కనిపిస్తోంది.
రణ్వీర్ తన గది బాల్కనీలో నిలబడి దూరంగా కనిపిస్తున్న నగర దీపాల వైపు చూస్తున్నాడు. అతని మనసులో ఆఫీస్ విషయాల కంటే, అన్విక భద్రత గురించిన ఆలోచనలే ఎక్కువగా ఉన్నాయి.
అప్పుడే అన్విక మెల్లగా అడుగులు వేస్తూ రణ్వీర్ దగ్గరకు వచ్చింది.ఇంకా పడుకోలేదా రణ్వీర్ గారు? ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది అన్విక.
రణ్వీర్ వెనక్కి తిరిగి చూసి చిన్నగా నవ్వి, ఏమీ లేదు అన్వీ.. మామూలుగానే ఆఫీస్ విషయాలు ఆలోచిస్తున్నాను.
రా.. నువ్వు కూడా ఇలా కూర్చో, అంటూ తన పక్కనే ఉన్న ఈజీ ఛైర్‌లో కూర్చుని, అన్వికను ప్రేమగా తన ఒళ్లోకి లాక్కున్నాడు.
అన్విక ఒక్కసారిగా కంగారు పడింది. అయ్యో.. వద్దు రణ్వీర్ గారు, నేను పక్కన కుర్చీలో కూర్చుంటాను. మీ ఒళ్లో ఎందుకు.. వదలండి అంటూ లేవబోయింది.