మళ్లీ ఎదురుపడబోతున్న బంధాలు…
మెడికల్ క్యాంప్ ముగిసేసరికి సాయంత్రం అయిపోయింది.
రోజంతా పనులతో అలసిపోయిన త్రిపుర ఇంటికి చేరుకుంది. గుమ్మంలోనే ఉన్న కమలాంబను చూసి నవ్వుతూ లోపలికి వచ్చింది.
“నానమ్మా! ఈరోజు క్యాంప్ చాలా బాగా జరిగింది. వచ్చినవాళ్లందరికీ పరీక్షలు చేసి మందులు కూడా ఇచ్చాం.”
“అవునా తల్లీ! చాలా కష్టపడ్డావేమో?”
“కష్టమేముంది నానమ్మా! ఇలాంటి పనులు చేయడం నాకు ఇష్టమే.”