New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
మౌనమే ని భాష – 11

మౌనమే ని భాష – 11

సంధ్యా సమయం ఆకాశం మెల్లగా రంగులు మారుతోంది. వంశీ, మాధవ్ ఇద్దరూ ఒక చెరువు గట్టు పక్కన కూర్చుని ఉన్నారు. 

 

వంశీ మనసంతా ఆ గదిలో వదిలేసి వచ్చిన ఆ పాత డైరీ మీదనే ఉంది.మాధవ్ తన స్నేహితుడి ముఖంలో ఉన్న గాంభీర్యాన్ని చూసి మెల్లగా అడిగాడు.

 

అవును వంశీ. ఇంతకీ ఆ డైరీలో ఆ అమ్మాయి పేరు ఏం రాసుకుంది,అసలు తను ఎవరు..

 

వంశీ నిట్టూర్పు విడిచి, అదే పెద్ద సమస్య మాధవ్. ఆ డైరీలో ఎక్కడా తన పేరు రాసుకోలేదు. కేవలం తన మనసులోని మాటలు, తన తల్లిదండ్రులకు చెప్పుకున్న కష్టాలు, ఆ అత్తామామల వేధింపులు.. 

 

ప్రస్తుతం నేను చదివినంత వరకు ఇవి తప్ప తన పేరు గానీ, ఊరు గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. అది ఒక పేరు లేని అమ్మాయి కథ లా ఉంది అన్నాడు దిగులుగా.

 

మాధవ్ ఆశ్చర్యపోయాడు. పేరు కూడా లేదా,మరి ఆ అమ్మాయిని మనం ఎలా గుర్తుపట్టాలి? కనీసం తను ఎలా ఉంటుందో నువ్వు చూశావు కదా అని అంటాడు. 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue