హాస్పిటల్ కారిడార్‌లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. హాస్పిటల్ లో శ్రావణిని జాయిన్ చేసిన అబ్బాయి ఆందోళనగా అటూ ఇటూ తిరుగుతుంటే, బయట నుంచి వర్షపు జల్లుల శబ్దం వినిపిస్తోంది.
అప్పుడే ఆ అబ్బాయి ఫ్రెండ్ హడావిడిగా లోపలికి వచ్చాడు.ఏమైందిరా వంశీ అసలు ఏం జరిగింది అని కంగారుగా అడిగాడు మాధవ్.
వంశీ జరిగినదంతా వివరించాడు. వర్షంలో ఆ అమ్మాయిని ఎవరో గుద్దేసి వెళ్ళిపోయారురా. తలకి దెబ్బ తగిలింది.
స్పృహలో లేదు.. అందుకే వెంటనే ఇక్కడికి తీసుకువచ్చాను అన్నాడు వంశీ.
నర్స్ అక్కడికి వచ్చి, సార్.. పేషెంట్ కి సంబంధించిన వారు ఎవరైనా ఉన్నారా. ఆమె వివరాలు మాకు కావాలి అని అడిగింది.
వంశీ దగ్గర ఆమె ఫోన్ ఉంది. వర్షానికి కొంచెం తడిచినా, లాక్ తీయగానే రీసెంట్ కాల్స్ లో స్నేహ అనే పేరు ఒకటి మాత్రమే పదే పదే కనిపించింది.