పార్కులో కూర్చున్న వంశీ చేతిలో డైరీ వణుకుతోంది. శ్రావణి జీవితం ఒక ప్రశాంతమైన నది అనుకుంటే, అది ఉప్పెనలా మారి తనను ఎలా ముంచెత్తిందో చదువుతుంటే వంశీ గుండె తరుక్కుపోతోంది.
ఆ తెల్లటి అంబులెన్స్ లో ఉన్నది శవం కాదు.. విధి ఆడిన వింత నాటకంలో బలైపోయిన శ్రావణి బావ ప్రాణం
అమ్మా.. ఆ అంబులెన్స్ డోర్లు తెరుచుకున్నప్పుడు ఊరంతా నిశ్శబ్దమైపోయింది. పోలీసులు వచ్చి జరిగిన విషయాన్ని మావయ్యకు వివరించారు.
బావను రిమాండ్‌కు తీసుకువెళ్తున్న పోలీస్ జీపును ఒక లారీ వేగంగా వచ్చి ఢీకొట్టిందట. ఆ ప్రమాదంలో జీపు నుజ్జునుజ్జయ్యింది.
బావ అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఒక కానిస్టేబుల్ కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నాడు.
ఆ వార్త వినగానే అత్తయ్య మతిస్థిమితం తప్పినట్టు ప్రవర్తించింది. ఒక్కసారిగా నా మీదకు వచ్చి మృగంలా దాడి చేసింది.