రాక్షస ప్రేమ -25
ఎందుకంటే శౌర్యకి నాన్ వెజ్ తినడం అస్సలు ఇష్టం ఉండదు, ఆఖరికి తను ఎగ్ కూడా తినదు, టచ్ కూడా చేయదు. అలాంటిది రౌద్రకి ఇష్టమని ఫిష్ బిర్యానీ ఆర్డర్ చేయడమే కాకుండా తనే తన చేతులతో ఫిష్ పట్టుకొని మరి ముల్లులు రాకుండా జాగ్రత్తగా తీసి అతడికి గోరుముద్దలు తినిపించింది.
“రౌద్ర నీకోసం ఎంత కష్టాన్నైనా భరిస్తాను, నేను కష్టాన్ని భరిస్తుంటే నువ్వు నాకు పంచే ప్రేమ ముందు ఆ కష్టం ఇసుక రేణువుతో సమానం. నువ్వు ఎంతో కష్టపడి ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేసి, వంటి చేత్తో మ్యాచ్ని గెలిపించావ్ అలాంటి నీకు ఇలాంటి చిన్న ట్రీట్ నేను ఇవ్వలేకపోతే ఎలా..? నీ కళ్ళలో ఆనందం కనిపించే ఆనందం ముందు నా కష్టం తేలిపోతుంది” అని నవ్వుతూ అన్నది శౌర్య.
రౌద్ర క్షణం కూడా ఆగకుండా ఆమెను మరింత దగ్గరగా లాక్కొని పెదవులు అందుకున్నాడు. చుట్టూ అందరూ ఉన్నారు అని కూడా అ క్షణం శౌర్య కూడా ఆలోచించలేదు అతడి ఆనందంలో తను కూడా పాలుపంచుకుంది.
రెండు నిమిషాల తర్వాత ఇద్దరు దూరం జరిగి ఒకరిని ఒకరు చూసుకొని నవ్వుకున్నారు.