New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రాక్షసుడి నీడలో – 3

రాక్షసుడి నీడలో – 3

శివాని చేతిలోని కాఫీ స్లిప్ అయ్యి అతని మీద ఓలికి పోతుంది.

 

 

అది చూసి శివాని తో సహా అందరూ షాక్ అయ్యి లేచి నిలబడి అతని వంక చూస్తారు.

 

 

అతను కూడా లేచి నిలబడి సూటిగా శివాని వైపు చూస్తూ మౌనం గా ఉంటాడు కానీ ఒక్కమాట కూడా మాట్లాడడు.

 

 

అందరూ కూడా శివాని వైపు ‘ అయ్యో ‘ అన్నట్టు జాలిగా , అతని వైపు భయం భయం గా చూస్తుంటారు.

 

 

( ఎందుకు అందరూ శివాని ని కోపం గా కాకుండా జాలిగా , అతన్ని భయంగా చూస్తున్నారు అన్నది హీరో క్యారెక్టర్ ద్వారా తెలుసుకుంటారు. బోర్ ఫీల్ అవ్వకుండా కొంచం ఓపిక వహించండి ప్లీజ్ ☺️).

 

 

 

సుజాత గారు ముందుగా జరిగిన దానికి రియాక్ట్ అవుతూ శివాని మీద కి చెయ్యి చేసుకోబోతారు.

 

 

శివాని కూడా తప్పు తనది కావడం తో సైలెంట్ గా ఉంటుంది. క్షణాలలో అక్కడ జరిగేది చూస్తుంటారు కానీ ఎవరు ముందుకు రాలేకపోతారు.

 

 

కానీ అంతలో సుజాత గారు ఆగిపోయి అతని వైపు చూస్తారు. ఎందుకంటే అతను ఆమె పై చెయ్యి వెయ్యనివ్వకుండా మధ్యలో అతని చెయ్యి పెట్టి ‘ఆపండి’ అన్నట్లు ఆపేస్తాడు.

 

 

అందరూ అతని వైపు చూస్తుంటారు. అతను మాత్రం శివాని వైపు సూటిగా చూస్తూ ” కొట్టడం వాళ్ళ జరిగింది మారుతుంది అంటే…..మీకంటే ముందు నేను రియాక్ట్ అయ్యేవాడిని ఏమో…., కానీ అలా జరగదు కదా….. తెలిసి చేసిన తప్పు అయితే శిక్షించచ్చు…., తెలియక చేసిన పొరపాటు కి మందలింపు సరిపోతుంది….” అంటూ అతను చూపు సుబ్రహ్మణ్యం గారి వైపు మరల్చి ‘ క్లీన్ చేసుకోవాలి ‘ అన్నట్టు గా షర్ట్ పై పడిన కాఫీ ని చూపించడం తో 

 

 

అప్పటి వరకు ఒక ట్రాన్స్ లో చూస్తున్న సుబ్రహ్మణ్యం గారు అతని దగ్గరకు వచ్చి ” మీరు రూమ్ లో కూర్చోండి సార్, నేను క్లీన్ చేయిస్తాను ” అని చెప్తుండగా ” డాడీ, మీరు ఇక్కడ ఉండటం మంచిది. నేను క్లీన్ చేసి ఇచ్చేస్తాను ” అంటూ ఎదురుగ ఉన్న పెద్దవాళ్ళను ఉద్దేశించి చిన్నగా సైగ చెయ్యడం తో సుబ్రహ్మణ్యం గారు కూడా అదే మంచిది అని ” సరే.., సార్ షర్ట్ వాష్ చేసి ఇవ్వమ్మా…” అని చెప్తారు.

 

 

శివాని ” అలాగే నాన్న ” అని చెప్పేసి ” రండి సార్ ” అంటూ అతన్ని తీసుకోని తన రూమ్ కి వెళ్లి డోర్ కొంచం ఓపెన్ లో ఉంచి వార్డురోబ్ నుంచి టవల్ ఇచ్చి దూరం జరిగి ” మీరు షర్ట్ ఇవ్వండి సార్ నేను వాష్ చేసి ఇస్తాను” అని అడుగుతుంది.

 

 

అతను కూడా సైలెంట్ గా టవల్ తీసుకోని వెనక్కి తిరిగి షర్ట్ తీసి టవల్ మెడ చుట్టూ వేసుకొని వెనక్కి తిరిగి చూడగా శివాని కుడా  వెనక్కి తిరిగి నించోని ఉంది.

 

 

అతను తన షర్ట్ తీసి సైలెంట్ గా వెళ్లి శివాని వెనుక నిలబడి షర్ట్ తీసి తన భుజాన వేస్తాడు.

 

 

తన మీద ఏదో పడింది అని ఉలిక్కిపడిన శివాని భుజం మీద ఉన్న షర్ట్ చూసి అతని వైపు తిరిగి కోపం గా ఏదో అనబోయి అంత దగ్గరకు వచ్చిన అతన్ని దూరం జరుపడానికి  అతని ఛాతి పై పెట్టి నెట్టడానికి ప్రయత్నిస్తుంది.

 

 

అతను  కనీసం అంగుళం కూడా కదలడు కానీ అతని ఛాతి పై పెట్టిన చేతికి తడి తగలడం తో శివాని అతని శరీరం వైపు చూస్తుంది.

 

 

అతని తెల్లని శరీరం ఎర్రగా కమిలిపోయి రక్తం పొంగుకొచ్చినట్టుగా కనిపిస్తుంది. అది చూడగానే తను చేసిన పని వల్ల జరిగింది గుర్తుకు వస్తుంది శివానికి.

 

 

నెమ్మదిగా అక్కడ బాధగా నిమిరి తన వార్డురోబ్ లో నుంచి మెడికల్ కిట్ తెచ్చి అతని చెయ్యిపోట్టుకొని లాగినట్టుగా తీసుకువెళ్లి బెడ్ మీద కూర్చోపెట్టి అతని పక్కన కూర్చొని కాలిన దగ్గర ముందు క్లీన్ చేసి, కూలింగ్ జెల్ అప్లై చేసి అతని వైపు చూడగా తననే ఇంటెన్స్ చూస్తూ ఉన్నాడు.

 

 

అతని చూపులు వల్ల ఎందుకో తను గట్టిగ మాట్లాడలేకపోతుంది. ఇక సైలెంట్ గా లేచి షర్ట్ తీసుకోని వెళ్లిపోతూ ” నేను నిజంగా కావాలని చెయ్యలేదు, ఐ ఎమ్ వెరీ సారీ ” అని ఆల్మోస్ట్ ఏడుపు గొంతుతో చెప్పి వెళ్ళిపోతుంది.

 

 

అతను దానికి ఏమాత్రం రియాక్ట్ అవ్వకుండా మొబైల్ ఏదో చూస్తూ బెడ్ మీద వాలిపోతాడు.

 

 

బయటకు పెద్దవాళ్ల మాటలు ముందుకు సాగుతూ పంతులు గారు రావడం, అమ్మాయిని చూసి పెళ్లివాళ్ళు ఓకే చెయ్యడం, కొంచం సేపట్లో ముహుర్తాలు పెట్టుకోడం కూడా జరుగుతుంది. చంద్రిక మౌనం గా చూస్తూ ఉంటుంది కానీ ఒక్క మాట్లాడలేక పోతుంది.

 

 

పంతులు గారికి సంభావన ఇచ్చి పంపించిన సుబ్రహ్మణ్యం గారు కాబోయే వియ్యంకుల వారితో బిజినెస్ విషయాలు మాట్లాడుతుంటే, సుజాత గారు చంద్రిక ను లోపలికి పంపించి ఆడవాళ్ళ దగ్గరకు కూర్చొని మాట్లాడుతూ ఉంటారు.

 

 

ఇక్కడ శివాని రూమ్ లో….

 

 

షర్ట్ తీసుకు వెళ్లి వాష్ చేసుకొని వచ్చి గిల్టీ ఫీలింగ్ తో నేల చూపులు చూస్తూ బయటకు వచ్చిన శివాని అతని కోసం చూడగా స్టడీ టేబుల్ దగ్గర శివాని ఇష్టం రాసుకున్న కోరికలు, మంచి మంచి జ్ఞాపకాలు రాసుకొనే బుక్ చదువుతూ కనిపిస్తాడు.

 

 

అంతే…! గిల్టీ ఫీల్ ని గంగ లోకి తొక్కి షర్ట్ ని బెడ్ మీద విసిరేసి, గబా గబా వెళ్లి అటు తిరిగి ఉన్న అతని వీపు పై గట్టిగ ఒక్కటి ఇస్తుంది.

 

 

 

 

అతని రియాక్షన్…..??

 

 

 

కంటిన్యూస్……!!!