మీ అబ్బాయికి ముందే పెళ్లి జరిగిందా..?? అని అడిగాడు సురేంద్ర అసహనం గా.
“అదేం మాట సురేంద్ర గారు.. మేమేం తప్పు చేశామని అలా అడుగుతున్నారు? మొగుడ్ని సరిగ్గా చూసుకోక ఇంకోడితో లేచిపోయిన దాన్ని వదిలేసిన మా అబ్బాయికి, ఈ పిల్లను ఇవ్వడం మీ అదృష్టం అనుకోవాలి..” అహంకారంగా అన్నాడు అబ్బాయి తండ్రి.
ఆ మాట వినగానే సీత గుండె పగిలినట్టయింది. మహాలక్ష్మి చిన్నప్పటి నుండి పడిన మానసిక వేదన, ఆ తండ్రి దూరమయ్యాడన్న లోటు ఒకవైపు దహిస్తుంటే, ఇప్పుడు ఇలాంటి మాటలతో తన బిడ్డను అవమానిస్తుంటే ఆమె గుండె తరుక్కుపోయింది. ప్రణతి కళ్లలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సురేంద్ర ముఖం కోపంతో ఎర్రబడింది.
మహా కళ్ల నుంచి నీళ్లు కారకుండా ఆపుకోవడానికి పెదవులు గట్టిగా బిగపట్టింది. ఆమె గుండెలోతుల్లో ఎన్నాళ్లుగానో దాగున్న క్షోభ ఒక్కసారిగా కట్టలు తెంచుకోబోయింది.
ఏమండీ.. మీరు ఏం మాట్లాడకండి.. అబ్బాయి కి పెళ్లయింది మూడేళ్ల కాపురం.. రెండేళ్ల బిడ్డ.. భార్య వదిలి వెళ్ళిపోతే అతనేం చేస్తాడు. మహా కి ఆ ఇంట్లో ఏ లోటు ఉండదు.. మంచి ఉద్యోగం.. ఆస్థి.. కానకుండానే ఒక బిడ్డ.. అంతే కదా.. అంది సుప్రజ.
అయితే అతనికి భార్య అవ్వాలని ఈ సంబంధం చూసావా.. ఆ బిడ్డకి ఆయా కావాలని చూసావా అమ్మ?? అంది ఆవేశం గా ప్రణతి.
సీత వేదనతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది.