మేమ్.. మీరు ఒకసారి కింద ఫ్లోర్ కి రాగలరా..?? అంటూ అడిగిన స్టాఫ్ నర్స్ వైపు సంకొచం గా చూసింది మహా.
హా.. డాక్టర్ మీకోసం చూస్తున్నారు.. అంది ఆమె.
సరే.. వస్తున్నా.. అని లేచింది మహా.
నేను వస్తా పద.. అని లేచింది ప్రణతి.
ఉహు.. ఇద్దరూ కాదు.. ఒక్కరే.. మీరు పేషెంట్ దగ్గర ఉండండి మేమ్.. అంది ఆమె.
ప్రణతి ప్రశ్నార్థకం గా చూసింది మహా వైపు.
నువ్వుండు ప్రణతి.. నేను వెళ్ళొస్తా.. అని ఆమె వెంట నడిచింది మహా.