New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
రావమ్మా.. మహాలక్ష్మి – 29

రావమ్మా.. మహాలక్ష్మి – 29

అంబులెన్సు హాస్పిటల్ చేరగానే హాస్పిటల్ వైపు వింతగా చూసింది మహా. సామాన్యులు ఎవరూ ఆ హాస్పిటల్ దరిదాపుల్లోకి రాలేరు.. ఎంతో విలువైనది అక్కడ వైద్యం. 

 

కానీ చిత్రం గా స్టాఫ్ ప్రేమగా లోపలికి తీసుకువెళ్లారు సీత ని. అలాగే మహా, విష్ణు, ప్రణతి లను కూడా గౌరవం గా రిసీవ్ చేసుకున్నారు. ఇంద్ర భవనం లా ఉన్న ఆ హాస్పిటల్ ని చూస్తేనే సగం జబ్బులు తగ్గిపోతాయేమో.. ఎక్కడ పేషెంట్స్ గోల, మందుల వాసన లేవు.. చాలా శుభ్రం గా ఉంది.. నర్సింగ్ స్టాఫ్ ముఖాలలో చెరగని చిరునవ్వు. అలాంటి ఒక అత్యాధునిక రీతిలో హాస్పిటల్ ఉందని కూడా వారికి తెలీదు. చుట్టూ చూడటం తోనే సరిపోయింది  వాళ్ళ మధ్య మాటలు లేవు. 

 

మేమ్.. పేషెంట్ ని రూమ్ కి షిఫ్ట్ చేసాం.. ఆ రూమ్ కి కనెక్టివ్ రూమ్ ఉంది.. అక్కడ మీరు విశ్రాంతి తీసుకోవొచ్చు.. అంటూ చిరునవ్వుతో చెప్పింది నర్స్. 

 

అయోమయం గా తల ఊపి.. గదిలోకి నడిచారు ముగ్గురు. 

 

సీత ని ఉంచిన బెడ్ తో సహా అంతా అత్యాధునిక టెక్నాలజీ.. పక్కనే ఉన్న కనెక్టివ్ రూమ్ లోకి వెళ్లి చూసారు.. విశాల మైన రెండు బెడ్స్.. సకల సదుపాయాలు ఉన్నాయి అందులో. 

 

విష్ణు.. ఈ రూమ్ పర్ డే ఎంత తీసుకుంటారో.. స్వగతంగా అంది మహా.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue