వద్దన్నా వదిలేస్తానా @13
అందుకే తాను స్కూల్ వదిలి వెళ్తున్న రోజు మరీ మరీ చెప్పాడు విరాట్..ఇకపై తన జీవితంలో ఏ రోజు ఏం జరిగినా ఏ క్షణం ఏ నిర్ణయం తీసుకున్న కచ్చితంగా తన ముందు ఉంచాలని తన దగ్గర ఏది దాచకూడదని..తను చెప్పాకే నిర్ణయం తీసుకోవాలని.. అలా ఒట్టు కూడా వేయించుకున్నాడు విరాట్.
విరాట్ కాలేజీ కోసం వేరే సిటీ పంపాలన్న తండ్రి, నానీల ( నానమ్మ ) ఆశను నీరు గారుస్తూ.. తానెక్కడికి వెళ్లట్లేదని, వైజాగ్ లోనే చదువుకుంటానని.. లేదంటే తాను పూర్తిగా చదువే మానెస్తానని బ్లాక్ మెయిల్ కి దిగాడు విరాట్.
కాదంటే తినకుండా నిరాహార దీక్ష చేస్తానని, ఇంకా తనని బందించాలని చూస్తే.. ఇంట్లో చెప్పకుండా పారిపోతానని బెదిరించాడు బాబు.