ఇంక తెల్లవారి పోయింది అందరు ఒక్కొక్కళ్ళగా లేస్తూ ఉన్నారు…. అక్షయ్ ఊరు వెళ్లి ఉదయాన్నే వచ్చాడు…. అక్షయ్ రాగానే అందరి మొహాలు చాలా ఉల్లాసంగా సంతోషంగా ఉండటాన్ని చూసాడు….
అపర్ణ గారు కూడా హుషారుగా అన్ని పనులు చేస్తూ ఉన్నారు…. ఏమైంది అంతా చాలా ఆనందం గా కనపడుతున్నారు అని అడిగాడు…. అది నీకే సర్ప్రైస్ రా ఒకసారి మన అక్షు రూమ్ కి వెళ్లి చూడు అని చెప్పారు….
అక్షు రూమ్ కా అని ఆశ్చర్యం అనుమానం కలిపిన భావం తో చూసాడు…. అప్పుడే బయటకు వచ్చిన అమృత అక్షయ్ ని చూసి ముందు కొంచెం కంగారు పడింది….
అక్షయ్ అక్షిత ప్రస్తుతం పడుకుంది…. నువ్వు ముందు వెళ్లి ఫ్రెష్ అయ్యి రా ఆ తర్వాత చూడొచ్చు అని చెప్పింది…. ఏమి మాట్లాడుతున్నావ్ అమ్ము అక్షిత అంటే నా ప్రాణం అలాంటిది తను వచ్చింది అని తెలిసి నేను తనని చూడకుండా ఉంటాను అని ఎలా అనుకున్నావ్….