New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
వేచానయ్య నీకోసం 🤍 – 5

వేచానయ్య నీకోసం 🤍 – 5

కోడలి మాటకి ఇంకా పెద్దావిడ కూడా ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది…

 

ఆర్యన్ ఫ్రెష్ అయ్యి రావడంతో అతనికి జింజర్ వాటర్ కలిపి ఇవ్వడంతో అది తాగుతూ గార్డెన్లో అటు ఇటు వాకింగ్ చేస్తున్నాడు…

 

ద్రుడమైన శరీరం, ఈ కాలంలో పదేళ్ల పిల్లలకు కూడా కళ్ళకి అద్దాలు వస్తూ ఉంటే 28 ఏళ్ల వయసులో కూడా అతను కిలోమీటర్ అవతల ఉన్న బోర్డు మీద అక్షరాలని చిటికెలో చదవగలడు….

 

అతని చేతులు నరాలు తేలి అతను చేస్తున్న కఠినమైన ప్రాక్టీస్ కి గుర్తుగా ఒళ్ళు జలదరించే అంత స్ట్రాంగ్ గా కనిపిస్తూ ఉంటాయి….

 

చల్లగాలికి గంటసేపు వాకింగ్ చేశాక అతను రూమ్ లోకి వెళ్లి మూవీ చూస్తూ కూర్చుని పోతే కావేరి నైట్ డిన్నర్ పనుల్లో ఉంటే పెద్దావిడ తను చూసుకునే డైరీ సీరియల్స్ చూస్తూ కూర్చుండిపోయింది….

 

జగన్నాధ్ గారు రియల్ ఎస్టేట్లో పేరు మోసిన రియల్ రియల్ ఎస్టేట్ టైకూన్…. తనని తొక్కాలనుకునే వాళ్ళని తొక్కుకుంటూ పోటీ వచ్చే వాళ్ళని తన మనుషులుగా మార్చుకుంటూ డేంజరస్ గా ఎదిగాడు….

 

****************

 

అనుకున్నట్టుగా ఆరోజు సాయంత్రానికి గాయత్రి వాళ్ళ పెద్దమ్మ కుటుంబం రావడమే కాకుండా గాయత్రి వాళ్ళ ముగ్గురు మేనమామలు కూడా ఇంటికి వచ్చారు…..

 

వాళ్లందరికీ దుర్గమ్మ హడావిడి హడావిడిగా తను చేసిన పిండి వంటలు వేడివేడి ఫిల్టర్ కాఫీ ఇస్తూ ఉంటే రామయ్య గారు వాళ్ళతో కబుర్లు చెబుతూ ఉంటే గాయత్రి మౌనంగా నిలబడడంతో “తల్లి ఇలా రా” అని మేనమామలు ప్రేమగా పిలవడంతో వెళ్లి వాళ్ళ మధ్యలో కూర్చుంది…

 

“చదువు ఎలా సాగుతుంది… అంత బాగానే ఉందా? కాలేజ్ కి వెళ్లి వస్తూ ఉంటే ఎవరైనా ఇబ్బంది పెడుతున్నారా?” అని మాట్లాడుతూ ఉంటే అంత బాగానే ఉందని వాళ్ళకి సమాధానం చెబుతూ ఉంటే అత్తలు కూడా ప్రేమగా వాళ్ళు తీసుకొచ్చిన బట్టలు నగలు ఆమెకి ఇస్తున్నారు….

 

కూతుళ్లు కోడళ్ళు రావడంతో దుర్గమ్మ కి ఇంక వంట గదిలో పని లేకుండా పోయినా కూడా తన చేతి వంట తినిపించడం కోసం వద్దంటున్నా వంట గదిలోకి వెళ్లి ఏదో ఒకటి చేస్తూనే ఉంది….

 

“అమ్మమ్మ…. మామయ్య వాళ్ళకి పెద్దమ్మకి నీ వంటలు కొత్త కాదు…. ఎందుకు అనవసరంగా శ్రమ తీసుకుంటున్నావ్?” అని అడిగింది గాయత్రి….

 

“కొత్త కాకపోయినా చాలా రోజులకి తింటూ ఉంటే నా పిల్లలకి ఆ మాత్రం వండి పెట్టకూడదా ఏంటి?” అని దుర్గమ్మ చెప్పడంతో “నీ ఇష్టం” అని చెప్పి వెళ్ళిపోయింది గాయత్రి….

 

అలా దసరా అయిపోయే వరకు అందరితో సరదా సరదాగా గడిపిన తర్వాత “ఇంక రేపు ఉదయాన్నే మేము అందరం వెళ్ళిపోతున్నామని” చెప్పడంతో గాయత్రి కి గుండెల్లో రాయి పడింది….

 

తనని ఎక్కడ వాళ్లతో పాటు హైదరాబాదుకి తీసుకువెళ్లి పోతానని చెప్తారేమోనని అక్కడికి వెళ్ళకుండా ఉండడానికి సకల ప్రయత్నాలు చేసి అవేవీ సక్సెస్ కాకపోవడంతో తన స్నేహితురాలు మంజూని ఆరోజు సాయంత్రం ఇంటికి పిలిపించింది….

 

“ఏమ్మా మంజు!!! బాగున్నావా?” అని రామయ్య గారు అడగడంతో “బాగున్నాను తాతయ్య… గాయత్రి ఎక్కడ?” అని అడగడంతో “అమ్మ గాయత్రి” అని పిలవడంతో ఏమీ తెలియనట్టుగా గాయత్రీ కిందకి వచ్చింది…

 

“రేపు మా అక్క పెళ్లిచూపులు అవుతున్నాయే…. నువ్వంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమని నీకు తెలుసు కదా… పైగా నాకున్న ఫ్రెండ్స్ లో నువ్వే నాకు ముఖ్యం కాబట్టి పెళ్లిచూపులు అయిపోయే వరకు నువ్వు నాతో పాటే మా ఇంట్లో ఉండాలి కాబట్టి నిన్ను తీసుకు వెళ్ళడానికి వచ్చానని” చెప్పింది….

 

దాంతో అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకుని “పెళ్లి చూపులకి చెల్లెలినే ఉండనివ్వరు అలాంటిది చెల్లెలి స్నేహితురాలు ఎందుకమ్మా?” అని అడిగింది గాయత్రి పెద్దమ్మ…..

 

“ఏర్పాట్లు చూసుకోవడానికి మాత్రమే తీసుకు వెళుతున్నాను పెద్దమ్మ…. పెళ్లిచూపులు జరిగేటప్పుడు నేను గాని గాయత్రి గాని అక్కడ ఉండమని” చెప్పడంతో “అవసరం లేదు… అక్కడ ఉండడం వీలుకానప్పుడు దాన్ని తీసుకొని వెళ్లడం ఎందుకు… పెళ్లికి వస్తుంది గాని పెళ్లి చూపులకి రాకూడదు” అని అన్నారు రామయ్య కుటుంబ సభ్యులు…

 

దాంతో మంజు ఏం చేయమంటావే అన్నట్టుగా స్నేహితురాలి వైపు చూడడంతో ఎలాగోలా చేసి తీసుకు వెళ్లిపో అని ఆమె కళ్ళతోనే బ్రతిమాలుతు ఉంటే “ప్లీజ్ పెద్దమ్మ… ఇప్పుడు గాయత్రి నాతో పాటు రాకపోతే రేపు గాయత్రి పెళ్ళికి కూడా మా అమ్మ పంపించదు” అంది మంజు….

 

“గాయత్రి పెళ్ళికి నువ్వు ఎలాగో వెళ్లడం కుదిరేటట్టుగా లేదు కానీ కావాలంటే మేమే మిమ్మల్ని తీసుకుని వెళ్తాం” అని దుర్గమ్మ చెప్పడంతో “అదేంటి గాయత్రి ఇక్కడే కదా ఉంటుంది పెళ్లి కూడా ఇక్కడే కదా అమ్మమ్మ జరుగుతుంది” అనగానే “లేదు గాయత్రిని వాళ్ళ పెద్దమ్మ వాళ్ళతో హైదరాబాద్ పంపించేస్తున్నాం తను ఇంకా అక్కడే చదువుకుంటుంది… తాతగారు కాలేజీలో తీసుకురావాల్సిన పత్రాలు కూడా తీసుకొచ్చాడు” అని చెప్పింది ఆవిడ….

 

దాంతో ఇంకా చేసేది ఏమీ లేక గాయత్రి మొహం వాలిపోవడంతో నేను కూడా ఏం చేయలేను అని తన వంతుగా ప్రయత్నించి మంజు అక్కడి నుంచి వెళ్ళిపోతే “అమ్మ గాయత్రి బట్టలు మొత్తం సర్ది పెట్టావా అంటూ ఉంటే దాని మొహం ఇక్కడ అన్ని లంగా వోణీలే కదా వేసుకునేది… పట్నం కాలేజీలో ఇలా వేసుకుంటే ఏడిపిస్తారు అంట కదా” అంది ఆవిడ….

 

కంటిన్యూస్!!!!