“మేడం… నేను కాకుండా ఇంతకుముందు ఇంకెవరైనా వచ్చారా? ఇదే తేదీకి సంబంధించిన రికార్డుల కోసం ఎవరైనా అడిగారా?”
ఆ మహిళ ముఖంలో అసహనం మరింత పెరుగుతుంది.
“ఎందుకు రాలేదు? ముగ్గురు అమ్మాయిలు వచ్చారు. నీ లాగే వాళ్లు కూడా తాము జర్నలిస్టులమని చెప్పారు.”
ఆ మాట వినగానే జ్వాల గుండె ఒక్కసారిగా ఆగినంత పనవుతుంది.
ముగ్గురు అమ్మాయిలా?
ఆమె మనసులో వెంటనే అక్క గుర్తుకు వస్తుంది.