మరుసటి రోజు…
ఉదయం నుంచే జ్వాల మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది.
రాత్రంతా సరిగ్గా నిద్రపోలేదు. కళ్ళు మూసుకున్న ప్రతిసారీ తన అక్క ఆద్య ముఖమే గుర్తుకొస్తోంది. ఆమె చివరిసారిగా తనతో మాట్లాడిన మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి.
తన అక్క మరణం వెనుక ఉన్న రహస్యం ఏమిటి?
ఆమె హాస్పిటల్ రికార్డుల నుంచి ఒక పేజీని ఎందుకు చింపి తన దగ్గర పెట్టుకుంది?
ఆ పేజీలో అంత ముఖ్యమైన విషయం ఏముంది?