స్వయంసిద్ధ – 11వ భాగం
ఇంటి నుండి బయటకు అడుగు పెట్టిన జాహ్నవి కి బయట ఉన్న చల్లని వాతారవరం ఆమె మనసులో మాత్రం ఒక కొత్త ఉత్సాహం నింపింది!
ఇంటి నుండి ప్రజావాణి డిజిటల్ కార్యాలయం కి వెళ్ళడానికి సరిగ్గా పదిహేను నిమిషాలు పడుతుంది! ట్రాఫిక్ కారణంగా ఇరవై నిమిషాలు పట్టింది!
ఆఫీస్ లోపలకు అడుగుపెట్టిన ఆమె, నేరుగా అరవింద్ ఉండే ఆఫీస్ రూమ్ లోకి నడిచింది!
ఈరోజు ఉదయమే అరవింద్ ఫోన్ చేసి ఆమెను ఆఫీస్ కి రమ్మని పిలిచాడు! ఏదో ముఖ్యమైన కారణమే ఉంటుంది అని వెంటనే బయలుదేరి అతని దగ్గరకు వచ్చింది జాహ్నవి!
అరవింద్ ఎదురుగా నిలబడ్డ జాహ్నవి ని కూర్చోమని సైగ చెయ్యగానే నవ్వుతూ కూర్చుంది జాహ్నవి!
తన చేతిలో ఉన్న నోట్ బుక్ ని అరవింద్ కి అందజేసింది జాహ్నవి! ఆ బుక్ ని చూసాడు అరవింద్!
సౌమ్య కనిపించకుండా పోయిన సంఘటన గురించి ఆ బుక్ లో రాసిన అంశాలు మూడు!
“కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం, సమాచారం ప్రకారం, ప్రేమ వ్యవహారంతో ఇంటి నుండి వెళ్లిపోయినట్లు అనుమానం!” అని మూడు అంశాలను చూసి నోట్ బుక్ ని మూసేసి జాహ్నవి ని చూసాడు అరవింద్!
“నువ్వు సౌమ్య గురించి ఓల్డ్ ఆర్టికల్స్ చూసావు కదా!”
“అవును సర్! కాని ఆ మూడు అంశాలకు పొంతనే లేదు!”
“ఈ వార్తల్లో నీకు తెలియని ఒక ముఖ్యమైన విషయం ఉంది.” అంటూ అరవింద్ అనగానే జాహ్నవి ఆసక్తిగా ఆయన వైపు చూసింది.