New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
నా మనసు దోచిన అతిధి {రాక్షస్ 🩶😈} – 5

నా మనసు దోచిన అతిధి {రాక్షస్ 🩶😈} – 5

 

నా మనసు దోచిన అతిధి [రాక్షస్ 😈 🖤]

 

 

అలా భ్రమలో ఊహల్లో తేలుతున్న నాకు మా మెయిన్ డోర్ కొట్టినట్లు శబ్దం వినిపించింది 

 

నేను చూసేలోపే గబగబా లోపలికి వచ్చేసాడు మా పక్కింటి బంటి గాడు రావడం రావడమే సాహి అక్క 

 

ఈరోజు మ్యాచ్ ఉంది కదా రాలేదేం అడిగాడు అక్కడున్న సిచువేషన్ వాడికి తెలీక అప్పటికే మా దేవిమాతా కోపపు చూపులు నన్ను బెదరగొడుతున్నాయి

 

చుట్టాల ముందు దీని పిచ్చి వేషాలు అన్నట్టు చూస్తుంది ఈ బంటి గాడు ఇంకేం వాగేస్తాడో నని 

 

నేను సాయంత్రం వస్తాలేరా నువ్వు పొ అన్నాను ఎందుకో నాకు వెళ్ళడం ఇష్టం లేదు అతనొక సారి చూసి తల తిప్పేసాడు నాకు తెలుస్తుంది 

 

కానీ బంటి గాడికి వాడి ఫ్రెండ్స్ కి ఇదొక ఇంపార్టెంట్ మ్యాచ్ ఎందుకంటే వీళ్ళ సీనియర్ల్ తో ఆడాలి 

వీళ్ళు గెలిస్తే వచ్చేదేం లేదు గానీ ఓడితే మాత్రం వాళ్ళు ఎప్పటి వరకు ఏం చెప్తే అది చేయాలి అదే వాడి బాధ కూడా 

 

మొదట్లో ఊరికే ఉండేవారు వీళ్ళు ఇలా మ్యాచ్ లకు పోయే వాళ్ళు కాదు నేనే పాపం అనవసరంగా నేనున్నా ఆడతా అని భరోసా ఇచ్చానూ

 

అందుకే నేను ఎప్పుడు వస్తే అప్పుడే వాళ్ళు కూడా ఆడతారు కానీ ఈ నిమిషం ఇక్కడినుంచి కదలాలని లేదు నాకు బహుశా అతని కోసమా ??

 

వద్దని మతి వాధిస్తున్నా మనసు వినట్లేదు ఏం చేయను !!!?

 

బంటి గాడు మా అమ్మ ముందు రెట్టించి అడగలేక దీనంగా ముఖం పెట్టుకొని చూస్తున్నాడు సోఫా లో ఉన్న ప్రతి ఒక్కరి చూపు నా మీదే కంగారు పుట్టింది 

 

వాడు కదల్లేదు మా అమ్మ ఇప్పుడేం అనలేదు వాళ్ళు ఉన్నారు కదా అందుకనీ

 

నాన్న ని చూసాను వెళ్ళమన్నట్టే ఉంది నాన్న చూపు 

అమ్మ మాత్రం బైరవ దీపం సినిమాలో లా 

 

మాంత్రికుడు రోజాను ఎత్తుకు పోయినట్టు అంతెత్తుకు తీసుకుపోయి అక్కడినుంచి పడేసేలా చూస్తుంది మా అమ్మ చూపులు బట్టి తను లోపల 

 

ఏం అనుకుంటుందో చెప్పేయగలను నేను!!

 

వాడిని చూస్తే జాలనిపించి అమ్మ తో తర్వాత తీరిగ్గా తన్నులు తినొచ్చని మెల్లగా తల దించి కళ్ళతో అతని వంక చూస్తూనే బయటకు నడిచాను 

 

ఇప్పుడు అతని చూపంతా ఫోన్ లోనే ఉంది ఏదో ఇంపార్టెంట్ ఏమో ??

 

నేను కదలడంతో మా బంటి గాడి మొహం లో నవ్వు చేరింది అదే నవ్వుతో వాడు నా వెనకే ఇద్దరం వెళ్లి పోయాం 

 

ఆర్య వర్ధన్ గారు ఎవరు పిలిచారు మా అక్క గొంతది ఆయన పేరు ఆర్య వర్ధన్ బావుంది అతని పేరు పలుకుతుంటే నా పెదవులు తియ్యగా అయిపోయాయ్ మనసు ఏదో కొత్త పులకింత పుట్టింది 

 

ఏంటి??

 

ఎందుకిలా ??

 

అతను మా అక్క కోసం కదా వచ్చాడు నేనెందుకు 

అతడి వైపు వెళుతున్నాను నా మనసు అతనికోసం ఎందుకు మొగ్గు చూపుతుంది ??

 

కంటికి ఏదైనా అందం కనిపిస్తే ఆకర్షితం అవుతాయి 

అదేనేమో అట్రాక్షన్ వలనేనా ఎమో ఇంతకంటే ముందుకు ఆలోచించాలని లేదు చెప్పాలంటే భయం 

గా ఉంది ఏదో జరుగుతుంది నా లోపల తెలుస్తున్నా 

వద్దనుకుంటున్నాను 

 

ఈ‌…ఆలోచనలోనే మేము అది గ్రౌండ్ కాదు చిన్న మట్టి రోడ్డు అటు వైపు పెద్ద ఎవరూ రారని ఇక్కడ ఆడుతాం

 

నేనేదో పెద్ద సచిన్ టెండూల్కర్ లా ఫోజు ఇచ్చి ఓ తెగ ప్రాక్టీస్ చేసేస్తున్నా మా బంటి గాడైతే నాకన్నా వాడేదో చోట ఎమ్ ఎస్ ధోనీ లా ఫీల్ అయిపోతూ 

 

ఆడడానికి సర్వం సిద్ధం అయ్యాడు!!

 

ఎప్పుడు బానే ఆడే నేను ఇప్పుడు మాత్రం దృష్టి పెట్టలేకపోతున్నాను అతడే.. వచ్చిన దగ్గర్నుంచి అతడే గుర్తొస్తున్నాడు ఫోర్స్ గా నా మైండ్ ని డైవర్ట్ చెయ్యాలని చూస్తున్నాను నా వల్ల అస్సలు కావట్లేదు 

 

వాడు గోలా ఏంటక్కా ఇలా ఆడుతున్నావ్ అని 

 

వాడితో ఏం చెప్పను నా బాధ !??

 

హా..అని ఊపిరి తీసి పాపం నావలన వాళ్ళు పనిష్ అవుతారు వద్దు అనుకున్న బాట్ తో వస్తున్న బాల్ ని బలంగా కొట్టాను మన మైండ్ ఎప్పుడు మనసు ని డామినేట్ చెయ్యలేదు ఇప్పుడే అర్థమైంది నాక్కూడా 

 

ఎందుకంటే బాల్ ఫోర్ కొట్టాను ఎంత ప్రయత్నించినా 

 

బంటి గాడు ఏడ్చేస్తున్నాడు !!!

 

నా వల్ల కావట్లేదు కానీ ట్రై చేస్తున్నాను ???

 

ఇదిలా ఉండగా నా కళ్ళకి రోడ్ మీద వెళుతున్న బ్లాక్ కలర్ కార్ కనిపించింది ఆటోమేటిక్ గా నా ఐస్ బాతు గుడ్లంత అయ్యాయి 

 

ఎందుకంటే ఆ కార్ ఆయనదే ఇంటిదగ్గర నుంచి వస్తున్నప్పుడు చూసాను మా ఇంటి ముందు రెండు కార్లు ఉన్నాయి అందులో ఒకటి ఇది

 

కానీ ఈయన నాకోసం వచ్చాడని నేను అనుకోను ఎందుకంటే ఎవరైనా ఇటు నుండే వెళ్ళాలి రూట్ ఇదే మరి 

 

సడెన్ గా ఆగింది కార్ ఏమైందో తెలియదు 

 

అతను బయటకు దిగి చెక్ చేస్తున్నారు వెళ్లి అడగాలని ఉంది కానీ అడుగు పడలేదు బంటి గాడు గోల గోల చేస్తున్నాడు నాకు వినిపిస్తోంది కానీ అతని నుంచి చూపు తిప్పుకోలేక పోతున్నా 

 

ఆయన చాలా సేపు చెక్ చేసి అవ్వలేదేమో నడుం మీద చేతులు వేసి ఉఫ్ అంటూ గాలి వదిలాడు 

 

ఆ పరిమళం ఇక్కడ…నేను ఉన్నచోటు వరకు పాకింది వల్లు వణికింది 

 

అనుకోకుండా చూసాడు నా వైపు నేను అప్పటికే చూస్తున్నాను 

 

నా అవతారం ఎలా ఉందంటే చున్నీ ఒక సైడ్ నుంచి తీసి ఇటు పక్కకు ముడి వేసాను ఉక్కగా అనిపించి జుట్టు తీసి పైకీ కొప్పు పెట్టి క్లిప్ తగిలించాను 

 

చెమట ముఖం మీద అదుముకుంది అది ఆట వలనో అతడి వలనో !!??

 

కళ్ళు చిన్నవి చేసి చూస్తుంటే ఏమైంది అని నన్ను నేను పరిశీలిస్తే గుండె దగ్గర చెమట పదునుకు టాప్ అతుక్కుని ఉంది చప్పున అతన్ని చూసి చున్నీ లాగేసి మామూలుగా వేసుకున్నాను 

 

నా చేతులు నాకు తెలియకుండానే నా డ్రెస్ ఎడ్జ్ ని నలిపేస్తుంటే పెదాలు వణికేస్తున్నాయి

 

అంతుచిక్కడం లేదు అతను మా అక్క కోసం వచ్చాడు గుర్తుంది నాకు మరెందుకు ఇలా..??? అయిపోతున్నాను కొంపతీసి నేను ఛ ఛ

 

అంతకంటే ముందుకు నా ఆలోచన సాగనివ్వలేదు 

నా మనసుని కుదుట పరుచుకోవడానికి ముప్పు తిప్పలు పడుతున్నాను 

 

ఈలోపు అతను మా ముందుకు వచ్చాడు!!

 

ఇంకేముందీ నా గుండె గూడ్స్ బండి కి తక్కువ కాలేదు కొట్టేసుకోడానికి !!

 

వచ్చి నించుని చూస్తుంటే మా బంటి గాడు అడిగాడు ఏం కావాలి సార్ అని 

 

కానీ నేను నోరుతెరవలేకపోయాను ??

 

ఇక్కడ దగ్గర్లో ఎక్కడైనా మెకానిక్ దొరుకుతాడా 

 

అమ్మో ఎంత పవర్ఫుల్ వాయిస్ ఇతనిది ఒక కమాండింగ్ ఉంది గొంతులో 

 

వాడు అడ్రస్ చెప్తుంటే ఈయన వెళతాడ ఎండలో అయ్యో అలవాటు ఉందా అసలు మీకు చెప్పలేదు కదూ అతని స్కిన్ టోన్ వెన్నుపూస రంగులో చిక్కటి మేని ఛాయ తో ఉంటుంది 

 

ఎండలో పది నిమిషాలు… కాదు కాదు రెండు నిమిషాలు నుంచున్నా చాలు టమోటా రంగులోకి కందిపోతాడు

 

నేను బంటి గాన్ని ఆపి ఒక అబ్బాయిని పిలిచి సైకిల్ లో వెళ్ళి తీసుకురమ్మని చెప్పా అతడు కష్టపడితే ఓర్వలేను అనిపించింది???

 

ఓరగా చూసినట్టు అనిపించాడు నన్ను తాకింది ఆ చూపు!!!

 

నన్ను ఆడక్కా వాళ్ళు నవ్వు తున్నారు బంటి గాడు ఒకటే నస ఏం చెయ్యనురా నేను నా పరిస్తితి దారుణం గా ఉంది ఒకటే ఒల్లంతా చెమటలు పట్టేసి 

 

కళ్ళు అతన్నుంచి పోవడం లేదు ఎవరికి చెప్పలేను 

అసలు ఈ ఫీలింగ్ ఏంటో నాకే అర్థం కావడం లేదు ఇంకెలా ఎవరితోనైనా చెప్పేది 

 

కెన్ ఐ ప్లే అతను అడిగాడు!!??

 

నాలో అంతులేని ఆశ్చర్యం ఇతను ఇలా మట్టిలో అంత గొప్పోడు కదా ఎలా అని 

 

బంటి గాడు ఏదో అనబోతే వాడి వైపు చూసాను సరే 

అనమన్నట్టు..అతడు చూస్తూనే నా చేతిలో బాట్ అందుకున్నాడు 

 

అప్పుడు అతని ముని వేళ్ళు నా అరచేతికి తగిలాయి అతనిలో ఏ భావం నాకు కనిపించలేదు కానీ నాలో మాత్రం ఒక జర్క్!!

 

కంటిన్యూస్ ❣️

 

యువర్ లుక్స్ మెల్ట్ మై హార్ట్ ❤️