నా మనసు దోచిన అతిధి {రాక్షస్ 🩶😈} – 4
నా మనసు దోచిన అతిధి [రాక్షస్ 😈 🖤]
అటువైపుగా చూసాక నా గుండె లయ తప్పింది చూపు గతి తప్పింది పెళ్లికొడుకు కూర్చుని ఉన్నాడు
చిక్కటి ఒత్తైన జుట్టు పొడుగైన చేతివేళ్ళు కూర్చుని ఉంటంతో కాళ్ళు పొడవు తెలియక పోయినా బాగా హైట్ అని తెలుస్తుంది
అంతవరకే కనబడుతోంది ఫోన్ వంక చూస్తున్నాడు ముఖం తెలియడం లేదు అలా చూస్తున్న నా మొహం దీపావళి కాంతులు నిండాయి పెదవులు అందంగా నవ్వుతున్నాయి అదెందుకో నాకు తెలియదు??
నా చూపు అతన్ని డిస్టర్బ్ చేసిందేమో టక్కున కళ్ళు పైకెత్తి చూసాడు ఈ సారి ఈ గుండె ఎక్కడ ఆగిపోతుందోనని భయమేసింది అయ్యయ్యో నేను పోతే ఎలా మొన్నే ఎగ్జామ్ రాసానే ఇంకా రిజెల్ట్ కూడా రాలేదు లోపలే పిచ్చిగా అనుకున్నాను
నేను గమనించిన అబ్బురమైన విషయం ఏంటంటే
అతను నేను సేమ్ కలర్ లో దుస్తులు ధరించాం హ హ
గులాబి రంగు షర్ట్ నా బోటమ్ కన్నా కాస్త ముదురు బిస్కెట్ కలర్ అన్నమాట జీన్ వేసాడు
అబ్బా చూడ్డానికి ఈ దృశ్యం అద్భుతం అనిపించింది నాకు అలా అనుకోగానే నా మోము పారిజాత పుష్పం లా నిగనిగలాడింది
అతని చూపు నా చూపు క్షణం కలిసాయి చూస్తున్నాడలా
నేను సింపుల్ డ్రెస్ నుదుటన స్టిక్కర్ కళ్ళకు కాటుక తో ఉన్నాను మరేం లేదు మెడలో మా నాన్న వేసిన గిఫ్ట్ చైన్ చాలా సన్నగా ఉంటుంది నాకు అలానే
ఇష్టం మూతికి ఏం పూయలేదు ఇప్పుడే కాదు ఎప్పుడు రాయను ఉన్న మెరుపు పోగొట్టుకోవడం ఎందుకు ఏదేదో రాసేసి అందుకే
అలా చూస్తున్న అతడి చూపులు సడెన్ గా నా జుట్టు మీద పడ్డాయి ఎందుకో గాని అతని కళ్ళు చిన్నవి అయ్యాయి రైలింగ్ కిందకి వేలాడుతుంది పరిగెడుతూ వచ్చాను కదా అలా ముందుకు పడింది
ఇప్పుడే వాష్ చేయడంతో సరిగ్గా ఆరలేదు కురులు కిందకి చిన్న బొట్లుగా నీళ్ళు కారుతున్నాయి
అలా చూసి షర్ట్ చూసుకున్నాడు నేను అతని చూపులు గమనించి అటువైపుకు చూసాను
చచ్చాను ఇందాక కంగార్లో టవల్ పడేసాను కదా వెంటనే పరిగెట్టి వచ్చాను ఈలోపు వీళ్ళు వచ్చున్నారు అంటే ఆ టవల్ ఈయన మీద పడిందా
నా కళ్ళు పెద్దవి అయ్యాయి కాస్ట్ లీ బ్రాండెడ్ షర్ట్ ఏమో నీటి తుంపర్లు అలాగే నిలిచి ఉన్నాయి
బొట్లుగా జుట్టు కొంత చాలా తక్కువ నేను డీప్ గా చూస్తున్నాను గనుక తెలుస్తోంది తడి ఉందని అంతలా ఎవరూ కనిపెట్టలేరు
అది చూస్తే దడ పుట్టింది నాకు ఎందుకంటే మా అమ్మ కి తెలిసిందో పెళ్లికొచ్చిన వాళ్ళని అవమానం చేస్తావా అని నా తాట వలిచి మా సోఫా లకు తోలు కుట్టిస్తుంది
అది గుర్తొచ్చి కాస్త భయపడి చూసాను నా చూపులో ఏం అర్థం అయిందో ఐస్ మాములుగా పెట్టి షర్ట్ పై వాటర్ డ్రాప్స్ ఉఫ్ అని ఊదేసాడు
హమ్మయ్య బతికాం అనుకున్నాను అప్పుడు!!??
వాళ్ళు మాటల్లో ఉండగా మీకు సింగిల్ డాటర్ నా ఎవరో అడిగారు దానికి మా నాన్న కాదు అని చెప్పి పిలిచేంతలోనే అమ్మ చిన్నగా అరిచి మరీ పిలిచింది
సాహీ అని..అతన్నే చూస్తూ సర్వం మర్చిపోయిన నేను మా అమ్మ రెండు సార్లు పిలిస్తే గాని పలకలేదు
ఆ అరుపుకి ఉలికి పడి వడివడిగా గదిలోకి వెళ్ళి పైన చున్నీ వేసి తడి ఆరని కురులను క్లచ్ లో బంధీ చేసి నెమ్మదిగా నడిచి వస్తున్నాను అదేంటో నాకే తెలియదు
ఎప్పుడు కాళ్ళకు చక్రాలు ఉన్నట్టు పరుగులు పెట్టే నా కాళ్ళు చాలా మృదువుగా గా పడుతున్నాయి నేలపై..స్టెప్స్ దాకా వచ్చాను గుండె రెట్టించిన వేగంతో ఆ చప్పుడు నా చెవులకు స్పష్టం గా వినిపించేలా ఉంది
మెట్ల మీద ఉన్న నన్ను అందరూ తిరిగి చూసారు నా కాళ్ళ కున్న పట్టీల వలనే అని నాకు అర్థమైంది ఈ కాలంలో పట్టాలా వాళ్ళ చూపుల అర్థం అలానే ఉంది కానీ నాకు పట్టీలు ఇష్టం
చిన్నప్పటి నుంచి మా నాన్నమ్మ చెప్పేది ఆడపిల్ల ఘల్లు ఘల్లు మని ఇంట్లో తిరిగితే సాక్షాత్తు ఆ లక్ష్మి దేవి తిరుగుతున్నట్టు అటా నేను అదే ఫాలో అయిపోయాను
నిద్రపోయేప్పుడు కూడా తియ్యను ఆ శబ్దం వింటుంటే జోల పాటలా ఉంటుంది నాకు..మా అక్క పెట్టుకోదు తను అలవాటు చేసుకోలేదు
మా అమ్మాజి కి అదే కోపం దీనికన్నీ వాళ్ళ నాన్నమ్మ బుద్దులే పోలికలే అంటుంది నాకో డౌట్ అలా అనుకునే ఆవిడ మీద కోపం అప్పుడప్పుడు నా మీద తీర్చుకుంటుందా అని ఏమో మరీ !!?
ఎదురుగా వచ్చి అమ్మ పక్కన చేరాను నాన్న నన్ను పరిచయం చేస్తున్నాడు తను మా అమ్మాయి సాహితి
ఇక్కడ ఉండదూ అని
నేను చిన్నగా నవ్వాను అతడి చూపుల దాడి నా మీదే ఉన్నట్లు అనిపిస్తుంది నిజమో కాదో చూడలేక పోతున్నాను పక్కనే ఉన్నావిడ నన్ను తేరిపార చూస్తోంది ఆ చూపు తప్పుగా ఏం లేదు నన్ను పరిశీలిస్తున్నట్టు ఉందంతే
ఏమైనా మాట్లాడుకుంటారా ఉన్నట్టుండి మా అక్క ని అతన్ని అడిగారెవరో
ఇద్దరికీ ఇద్దరూ తెలుసు ఇంకేం మాట్లాడుకోవాలి ఒక దగ్గరే గా ఉండేది ఇద్దరూ అదే చెప్పారు
ఛా నా ఊహలను ఉల్లంఘించారు వీళ్ళిద్దరూ ఔను
మొదట అబ్బాయి వెళితే వెనకే అమ్మాయి లేచి అమ్మ నాన్న వైపు బెరుకుగా చూస్తే వాళ్ళు వెళ్ళమని దైర్యం చెబితే వెళ్ళే సీన్ లు ఎన్ని మూవీస్ లో చూసాను
వీళ్ళేమిరా అంటే అసలు ఆ టైపే కాదన్నట్లు ఉన్నారు
మా అక్క కూడా ఆ మెలోడీ టైప్ కాదు తెలుసు నాకు మా అక్క వైపు చూసాను ఎల్లో గోల్డ్ మిక్స్ కొట్టిన లెహంగా వేసుకుంది అది కూడా చాలా రిచ్ గా మంచి వర్క్ తో ఉంది
ఇదొక సారి మనం వేసుకుంటే ఎలా ఉంటుందో ట్రై చేయాలి అనుకున్నా
కొద్దిగా మేకప్ వేసుకుంది పోనీ టైల్ నే కానీ చాలా డిఫరెంట్ హెయిర్ స్టైల్ చేసుకుని లిప్స్టిక్ వేసి ఓ చేతికి వాచ్ మరో చేతికి సింగిల్ బాంగిల్ అంతే
చాలా అందంగా ఉంది నాకైతే ఓ రెండు పిక్స్ తీసి దాచుకుందాం అని ఉంది నేను వెళ్ళాక చూసుకోడానికి వీలైతే ఇద్దర్నీ పక్కపక్కనే పెట్టిన ఒక పిక్ తీద్దాం అనిపించింది కానీ ఏంటో ఆగిపోయా ??
ఎంతయినా ఫ్యాషన్ డిజైనర్ కదా ఔను మా అక్క ఎదురుగా ఉన్నారే వాళ్ళ బొటిక్స్ లోనే కాస్ట్యూమ్ డిజైనర్ గా చేస్తుంది ప్రపంచమంతా బ్రాంచెస్ ఉన్నాయి వాళ్ళకి మిస్ ఇండియాస్ కి డిజైన్ చేస్తారు
మూవీ ఫీల్డ్ కి కూడా ఇలా చాలా వాటికి
అంత ఉన్నోళ్ళు అక్క ని ఎందుకు చేసుకోవడానికి ఇంత ఉత్సాహం చూపిస్తున్నారో నాకు అర్ధం కాలేదు
ఏమో మరి వాళ్ళకి ఇలాంటి ఫ్యామిలీ కావాలేమో తెలియలేదు!!??
ఆ..ఆలోచనతోనే ఉన్న నాకు అమ్మ స్నాక్స్ ఇమ్మని చెప్తుంది అక్క చేతే ఇప్పిద్దాం అని పిలిస్తే నా ఆలోచనల్లో నేనుండగా నో మోర్ ఫార్మాలిటీస్ అన్నారు నేను వినలేదు
అందుకే అమ్మ ఇచ్చినవి టేబుల్ మీద పెడుతున్నాను
అతని పక్కన ఉన్న నాకు శ్వాస బలంగా పీలుస్తున్నాడు అనిపించింది ఏంటో నా వంటి పరిమళమో ఏమో నాకలా అనిపిస్తుంది నిజమా కాదో మరీ ??
మళ్ళీ అమ్మ పక్కకు వచ్చేసాను ఏదో తేరుకున్నట్టు
అతని ఫేస్ నార్మల్ చేస్తున్నాడు
“నిజం చెప్పనా ఎలా ఉన్నాడో”
ప్రభాస్ హైట్ మహేష్ వైట్ రానా ఫిజిక్ రామ్ చరణ్ హెయిర్ ఎవరైనా ఒక హీరో లుక్ లో ఊహిస్తాం మరి ఈయనేంటో అందరినీ కలిపి మిక్సీలో వేసి తీస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు అందం తింటున్నాడా రోజూ
నిజంగా సందేహం కలిగింది!!!
అలాగే రోజు నా కలలోకి వచ్చి కలవరపెట్టే మనిషి లానే అనిపించాడు
ఔను నేను కొంచెం ఫాంటసీ టైప్ ఊహల్లోనే ఎక్కువ ఉంటాను జస్ట్ అంతే నన్ను గత కొద్ది రోజులుగా
ఒక డ్రీమ్ కలవరం పెడుతుంది అది ఏంటంటే
నల్లని రంగు కప్పుకున్న నీలి ఆకాశం కిందన ఒక అందమైన ప్రదేశం నేను బెంచ్ మీద కూర్చుని ఉంటాను ప్రకృతి పసిడి కుసుమాలు రాలుతూ ఉంటాయి
అప్పుడే ఒకతను వస్తాడు నా ముందు నీల్ డౌన్ అయ్యి మరీ కూర్చుంటాడు నేను వైట్ కలర్ డ్రెస్ వేసాను అతను అదే రంగులో చొక్కా వేసుకుని ఉంటాడు
మొహం కనిపించదు నుదురుపై తారలాడుతున్న సిల్కీ హెయిర్ కళ్ళకు దగ్గరగా ఉంటుంది అచ్చు నా ఎదురుగా ఉన్నాడే ఇలానే
పొడుగాటి వేళ్ళు సేమ్ టు సేమ్
ఏదో చెప్పాలని అనుకుంటున్నాడు నేను వినాలనే అనుకుంటున్నాను కానీ చెప్పలేకపోతాడు
అతని కళ్ళలో ఏదో భావం ఉంది నాకది అర్థం కావడం లేదు చాలా సేపు ప్రయత్నించి ప్రయత్నించి
చూస్తాడు చెప్పాలనీ ఈలోపు నాకు మెలుకువ వచ్చేస్తుంది నాకలలో ఉన్న అతడి లానే ఉన్నాడు ఇతను నేను అలా అనుకుంటున్నానో ఏమో మరి నాకైతే తెలియదు!!!??
కంటిన్యూస్ 💞
ఎంతగానో అనుకుంటున్నాను నా చూపులు బంధనం తప్పించాలని నా వలన ఎందుకు అవడంలేదు ఇందుకు కారణం నీకు తెలుసా
Swipe left/right or tap the sides to turn pages