New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
స్వయంసిద్ధ – 21
స్వయంసిద్ధ Premium 7 min read

స్వయంసిద్ధ – 21

స్వయంసిద్ధ – 21వ భాగం

 

ప్రజావాణి డిజిటల్‌ కార్యాలయం లోని తన క్యాబిన్ లో కూర్చున్న జాహ్నవి, రాత్రి తనకు వచ్చిన ఆడియో ఫైల్‌ వివరాలను ఒకసారి పరిశీలించింది.

ఆ మెయిల్‌ పంపిన చిరునామా కొత్తది. వ్యక్తిగత వివరాలేవీ లేవు. ఫైల్‌ పేరు కూడా సాధారణంగా ఉంది.

అరవింద్‌ ఆమెను గమనించి దగ్గరకు వచ్చాడు.

“జాహ్నవి! మేఘనా రెడ్డి గారు ఆడియో ఫైల్ తీసుకొని రామ్మనారు కదా! నాకు కొంచెం పని ఉంది! నువ్వు తీసుకెళ్ళు!”

“అలాగే సర్! ఇప్పుడే స్టేషన్ కి వెళతాను!”

“జాహ్నవి! ఒక్క విషయం! ఈ ఆడియోలోని విషయాలు బయటకు రాకూడదు! అది నిజం అని తెలిసిన తరువాత న్యూస్ లో రావాలి! జర్నలిజంలో కొన్నిసార్లు వార్త రాయడం కంటే, వార్త రాయకుండా ఉండటమే పెద్ద బాధ్యత.” అంటూ అరవింద్ చెప్పిన మాటలు అర్థం అయినట్టు తలూపింది జాహ్నవి!

ఆ ఆఫీస్ నుండి బయలు దేరిన జాహ్నవి, సరిగ్గా గంట తరువాత పోలీస్ స్టేషన్ లోపలకు వెళ్ళింది! అక్కడ ఆమెను చూసిన కానిస్టేబుల్ లోపలకు వెళ్ళమని సైగ చేసాడు!

జాహ్నవి నవ్వుతూ ఎస్. ఐ రూమ్ వైపుగా నడిచింది! ఆ సమయంలో మేఘనా రెడ్డి ఒక కేసు ఫైల్ చూస్తుంది!

లోపలకు వచ్చిన జాహ్నవి ని చూడగానే ఫైల్ మూసి ఆమెను కూర్చొమ్మని చేతులతో సైగ చేసింది మేఘన రెడ్డి!

“చెప్పు జాహ్నవి! తీసుకొచ్చావా ఆడియో మెసేజ్!”

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue