New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
స్వయంసిద్ధ – 22
స్వయంసిద్ధ Premium 8 min read

స్వయంసిద్ధ – 22

స్వయంసిద్ధ – 22వ భాగం

 

రాత్రి పది గంటలు దాటుతుంది. బయట వీధులన్నీ నిశ్శబ్దం కప్పుకొని పడుకున్నాయి! కిటికీ కి ఉన్న పలుచని తెరలు అప్పుడప్పుడు కదులుతున్నాయి. తెరిచి ఉన్న కిటికీ సందు లోంచి చల్లని గాలి మెల్లగా గదిలోకి ప్రవేశించింది.

రోజంతా గదిలో పేరుకుపోయిన వెచ్చదనాన్ని తనతో పాటు బయటకు తీసుకెళ్తున్నట్టుగా ఆ గాలి గదినంతా తాకింది.

కిటికీ పక్కనే ఉన్న తెరలు గాలికి సుతారంగా రెపరెపలాడుతూ గోడకు వేలాడుతున్నాయి.

ఆ చల్లదనంలో ఏదో తెలియని ప్రశాంతత ఉంది. వాతావరణాన్ని ఒక్కసారిగా మార్చేసింది.

ఆ చల్లదనాన్ని ఆస్వాదిస్తూ తన ల్యాప్ టాప్ ముందర బెడ్ పై కూర్చుంది జాహ్నవి!

ఆ ల్యాప్ టాప్ లో సాయంత్రం తన మెయిల్ కి వచ్చిన ఫోటో ఓపెన్ లో ఉంది!

ఆ ఫొటోను చూస్తున్న కొద్దీ జాహ్నవికి కొత్త ప్రశ్నలు పుట్టుకొస్తున్నాయి.

సౌమ్య కాలేజీ వెనుక రోడ్డుపై నిలబడి ఉంది. ఆమె ఎదురుగా ఒక వ్యక్తి నీడ. అతని ముఖం కనిపించడం లేదు. చేతికి మాత్రం ఒక గడియారం స్పష్టంగా కనిపిస్తుంది. అది ప్రశాంత్‌ చేతికి ఉన్న గడియారం లాగే ఉంది! కాని అదే వాచ్ అని కన్ఫాం గా చెప్పలేము!

ఫొటోను ఎవరు తీశారు? ఎప్పుడు తీశారు? అది నిజమైన ఫొటోనా? లేక ఎడిట్ చేసినదా?

జాహ్నవి ని ప్రశాంత్ కలిసినప్పుడు అతని చేతికి ఉన్న వాచ్ ని చూసింది జాహ్నవి! నల్లటి పట్టీ, వెండి రంగు డయల్‌, పక్కన చిన్న ఎరుపు గుర్తు ఉన్నాయి. ఈ ఫొటోలో కూడా అలాంటిదే కనిపిస్తుంది.

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue