సరే బావా వెళ్లి రా అంటుంది ముఖం చూడకుండా
సంతోషంగా శ్రీధర్ ఆఫీస్ కి వెళ్ళిపోతాడు.. తను వెళ్ళాక కాసేపు అలసట కనిపించడంతో నిద్రపోతుంది
మధ్యాహ్నం భోజనం చేసి అంట్లు తోముతున్న అప్పి ఫోన్ మోగడం చూసి వెళ్లి లిఫ్ట్ చేస్తుంది.
నేను మాట్లాడుతున్నాను అని అటువైపు నుంచి కట్టుగా వినిపిస్తుంది ఒక గొంతు అది గుర్తుపట్టి
చెప్పు బాబాయ్ ఏంటి?? ఇలా ఫోన్ చేశావు!! అని అడుగుతుంది అపరంజి ఏమీ తెలియనట్టే…
నాకు ఒక పది లక్షలు కావాలి అని అడుగుతాడు వాళ్ళ బాబాయ్…