అప్పి మాటలు విన్న శ్రీధర్ బాధగా తన ఇంటికి వెళ్లిపోతాడు.
ఎంతసేపు నాకు పెళ్లిఇష్టంలేదు అని బాధపడ్డాను కానీ ఈ రోజైనా అప్పికి కూడా ఇష్టం ఉందా?? లేదా?? అని ఆలోచించలేకపోయాను
పెళ్లి జరిగాక అది నా నుంచి ఏమీఆశించలేదు కనీసం మూర పూలు కూడా నేనే నామాటలతో చాలా బాధపెట్టాను
అయినా ఎవరిని ఏ రోజు ఒక మాట కూడా అనలేదు హ్యాపీగానే ఉంచింది మమ్మల్ని… అనుకుంటూ నిద్రలోకి జారుకున్నాడు
మెలకువ వచ్చేసరికి సాయంత్రం అయింది ఇవాళ వెజిటేబుల్స్ తెచ్చిఇవ్వాలి అనుకుంటూ ఫ్రెష్ అయ్యి అప్పి ఇంటికి వెళ్ళాడు వెజిటేబుల్స్ తీసుకొని…
అలా లోపలికి వెళ్ళాడో లేదో పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి ఏం జరుగుతుంది అనుకుంటూ పరిగెత్తాడు లోపలికి వెళ్లేసరికి…