ఆద్వైత్ కి గత జన్మలో జ్ఞాపకాలు మెల్లగా గుర్తుకొస్తూ, సావిత్రి, మృణాళినిని రాజేంద్ర వర్మ నుంచి కాపాడేందుకు ప్రయత్నించిన విషయం బయటపడుతుంది. మృణాళిని తల్లి సావిత్రి ఎవరు, ఆమె చేతిలో ఉన్న లాకెట్ రెండో భాగం ఎక్కడికి వెళ్లిందనే రహస్యం మరింత ఉత్కంఠను పెంచుతుంది.
***
ఆద్వైత్ తల పట్టుకుని కూర్చున్నాడు.
“సావిత్రి…!” ఆ పేరు అతని నోట నుంచి మళ్లీ మెల్లగా వచ్చింది.
మృణాళిని అతని పక్కనే కూర్చుని… “మీకు ఆమె ఎవరో గుర్తొస్తుందా?” అని అడిగింది.
అప్పుడు ఆద్వైత్.. “నాకు తెలియదు… కానీ నా జ్ఞాపకాల్లో ఆమె కనిపించింది.” అని చెప్పాడు.
రాజేంద్ర వర్మ మాత్రం నిశ్శబ్దంగా వాళ్లిద్దరినీ గమనిస్తున్నాడు.