గతజన్మలో మృణాళినిని చిన్న పాపగా రాజేంద్ర వర్మ బంగ్లాకు తీసుకొచ్చి తన కూతురిగా పెంచిన రహస్యం బయటపడుతుంది. మృణాళిని తన కన్నతండ్రి రాజేంద్ర వర్మ కాదని, అతను తనను చిన్నప్పటి నుంచి ఏదో రహస్య కారణంతో దాచిపెట్టి పెంచాడని సుబ్బమ్మ ద్వారా తెలుసుకుంటుంది. రాజేంద్ర వర్మ సొరంగంలోకి వచ్చి “నీ రక్తం నాదే” అంటూ అసలు నిజాన్ని దాచిపెడుతుండగా, ఆద్వైత్ అతన్ని నిలదీయడంతో మృణాళిని జన్మ రహస్యం మరింత ఉత్కంఠగా మారుతుంది.
***
ఆద్వైత్ గట్టిగా రాజేంద్ర వర్మ ను నిలదీసి అడిగేసరికి..
“నీకు అడిగే హక్కు నీకు ఉంది ఆదీ… ఎందుకంటే ఈ కథలో నువ్వు కూడా ఉన్నావు.” అని అన్నాడు రాజేంద్ర వర్మ.
ఆద్వైత్ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
“ఆదీ…?”
రాజేంద్ర వర్మ మాట విన్న వెంటనే అతని కళ్ల ముందు కొన్ని దృశ్యాలు మెరిశాయి.