దుర్గ కి వాళ్ళ తల్లికి జరుగుతున్న ఘర్షణలో అనుకోకుండా ఒక్కసారిగా ఉయ్యాల దగ్గరికి వెళ్లి, సీత అని పిలిచేసరికి అందరిలో లేనిపోని అనుమానాలు కలిగాయి. చివరికి దుర్గ అమ్మ నే లక్ష్మీ అత్తగారి చెప్పిన వాటిని వివరిస్తూ సీత అనే పేరుకి అర్థం చెప్పేసరికి అందరూ చూస్తూ ఉండిపోయారు.
***
అలా విధి వల్ల, విధాత రాసిన రాత వల్ల అనుకోకుండా తన తల్లి నుంచి తనను దూరం చేయడమే కాకుండా.. తోడబుట్టిన వాడి ప్రేమానురాగాలకు కూడా దూరం చేశాడు.
పోను పోను లక్ష్మికి ఆరోగ్యం కుదుట పడింది. కొన్ని రోజుల తర్వాత లక్ష్మి వాళ్ళ అమ్మ గారి ఇంటి నుంచి కొంచెం దూరం ప్రాంతానికి అద్దెకు ఇల్లు తీసుకుని కొడుకు, భర్తతో కాపురానికి వెళ్ళిపోయింది. ఇక్కడే ఉంటే పుట్టింటోళ్లు పెడతారు అని చెప్పి ఇంకా బాగా సోమరిపోతుగా తయారవుతున్న భర్తను భరించలేక ఈ నిర్ణయం తీసుకుంది లక్ష్మి.
పుట్టింటికి దగ్గరగా ఉండడం వల్ల ఒక పక్క కూతురు ను చూసుకునే అవకాశం ఉంటుందని స్వార్థంతో ఇన్ని రోజులు అక్కడే ఉండిపోయింది కానీ రాను రాను ఇంకా చూడడం ఇష్టం లేక దూరంగా ఉన్న అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉండొచ్చు అనే ఉద్దేశంతో ఆ ఏరియా వదిలి వెళ్ళిపోయింది.
వారానికి ఒకరు చొప్పున ఎవరో ఒకరు లక్ష్మీ వాళ్ళ అమ్మ గారి ఇంటికి వస్తూ ఉండేవారు. దుర్గ ఇంటిలో ఉన్న ఇంటి పని చేసేది కాదు.. ఏదో పనికి వెళ్లి వస్తూ ఉండేది ఇంట్లో ఉన్నంతసేపు పాపను చూసుకుంటూ ఉండేది. ఇంకా దుర్గ అమ్మ అయితే ఇంట్లో వండుకోవడం పాప ను చూసుకోవడం సరిపోయేది. అదికాక బయట పనికి కూడా వెళ్లి వస్తూ ఉండేది. అందుకే ఈమె కూతుర్లు ఎవరో ఒకరు వారానికి ఒకసారి వచ్చి బట్టలు, ఇంటి శుభ్రం లాంటి పనులన్నీ చేసి వెళ్తూ ఉండేవారు.