New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఆమె మనసులో.. సీత కథ – 17

ఆమె మనసులో.. సీత కథ – 17

లక్ష్మీ కూతురు సీతకి తల్లి తండ్రి ఎదురుగా ఉన్నా కూడా పిన్ని దుర్గ, అమ్మమ్మ, తాతయ్యల దగ్గర పెరగాల్సి వచ్చింది. తన బాధ్యతను దుర్గ తీసుకొననే సరికి మిగిలిన అక్క చెల్లెలు ఏదో అనుమానం వ్యక్తం చేయబోతే వారిలో పెద్ద కూతురైన ఆమె తెలివిగా ఏమీ లేదన్నట్టు మాట మార్చింది ఆ నిమిషానికి ఆ విషయాన్ని మరిచిపోయి అందరూ ఆ పాప సంబరంలో పండగ చేసుకుంటుండగా మధ్యలో లక్ష్మీ వాళ్ళ అమ్మ వచ్చి అసలు ఏం జరిగిందో మొత్తం విషయాన్ని చెప్పింది.

 

***

 

లక్ష్మీ వాళ్ళ అమ్మ లక్ష్మీ అత్త గారు చెప్పిన విషయం గురించి చెపుతూ మధ్యలో ఆగి తన బిడ్డలు అందరి వైపు చూసింది.

 

ఆమె చెప్పింది వింటున్న వాళ్ళు అందరూ కూడా.. “ఆమె అంత చెప్పిందా!? ఇక్కడేమో ఏవేవో మాటలు అనేసి కోపంగా ఏడ్చుకుంటూ, తిట్టుకుంటూ వెళ్లిపోయింది.. మరి నీతో ఎప్పుడు అమ్మ ఇవన్నీ మాట్లాడింది?” అని అడిగారు..

 

“ఏం చేస్తాం.. ఎంతైనా వియ్యపురాలు, కూతురు ను ఇచ్చుకున్నాను.. అదికాక బాల్య స్నేహితురాలు.. ఎంత కాదనుకున్నా తప్పదు కదా! పాపని మీరు చూసుకుంటున్నప్పుడు, లక్ష్మీ గురించి వీళ్ళు బాగుంది అని చెప్పాక.. గబగబా నడుచుకుంటూ వెళ్లాను కదా.. ఆమె దగ్గరికే వెళ్ళాను. మళ్లీ సమయం గాని సమయంలో ఎలా వెళ్తుంది ఎక్కడికి వెళ్తుంది? అసలు ఆవిడకు ఏమి తెలియదు కదా అనుకుని.. తింగరి ముఖంలా నేను వెళ్ళా.

 

వెళ్లాక తెలిసింది నేనే పెద్ద తింగర ముఖం అని.. దేవుడు దేవుడు అనుకుంటూ చాలా జ్ఞానమే ఉంది వీళ్ళ అత్త గారికి. ఏమని అనుకుందో ఏమో తెలియదు గానీ తన దగ్గరికి వెళ్లేసరికి ఇవన్నీ చెప్పింది. సరే అనుకుని వచ్చేసాను, అప్పుడే చెప్పాలి అని అనుకున్నాను మీతో కానీ, కోపంలో ఉన్నారు అందరూ ఆవిడ మాటలకి.. అందుకే ఎందుకని చెప్పలేదు తర్వాత నాకు గుర్తు లేదు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue