లక్ష్మీ తన ఆరోగ్యం కుదుటపడిన తర్వాత రోజురోజుకీ బాధ్యత హీనంగా తయారవుతున్న భర్తను మార్చుకోవడానికై కూతురు కు దూరంగా ఉన్నా సరే పుట్టింటి నుంచి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంది. కాలంతో పాటే సీత కూడా ఎదుగుతూ వచ్చింది.
***
సీత ఆ పక్కింటి ఆంటీ చెప్పినది అంతా తన అమ్మమ్మ కి ఏడుస్తూ చెప్పింది. సీత మాటలు విన్న ఆవిడ మనసులోనే అమ్మనా బాతులు తిట్టుకుంది ఆ పక్కింటి ఆంటీ ను..
అంత చెప్పినా ఏమి మాట్లాడకుండా ఏదో ఆలోచిస్తున్న అమ్మమ్మ ను చూసి..
“ఏంటి అమ్మా! ఏమి మాట్లాడవు? నేను నీ కూతురును కాదా!? ఇది మన ఇల్లు కాదా! దుర్గ అమ్మ, నువ్వు, తాత, మావయ్య.. ఇదే కదా మన కుటుంబం.. అప్పుడప్పుడు వస్తున్న వాళ్ళు మన చుట్టాలు కదా! నిజామా కాదా చెప్పు అమ్మా!” అని ఏడుస్తూ వాళ్ళ అమ్మమ్మ ను పట్టుకుని లాగుతూ అడుగుతూనే ఉంది సీత.
ఆ చిన్ని తల్లి అలా ఏడుస్తూ అడుగుతుంటే ఆమెకు ఏమి చెప్పాలో అర్థం కాలేదు. సీత మాత్రం ఏడుస్తూనే ఉంది. సీత కళ్ళు ఏడ్చి ఏడ్చి ఎర్రగానూ, మొఖం అంతా కూడా ఎర్రగా కందిపోయింది.