New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 22

ఎదురు గాలిలో ఎగిరిన ఓ మగువ – 22

“మాస్టారు గారూ, సిద్ధార్థ్ చాలా తెలివిగా అడుగులు వేస్తున్నాడు. ఢిల్లీ స్థాయిలోని పెద్దల రికమండేషన్లతో వాడు చింతపల్లె అడవుల్లో మైనింగ్ లీజును రీ-ఓపెన్ చేయించాలని చూస్తున్నాడు. దానికి తోడు మన అక్షర, వివేక్ చదువుకునే స్కూల్ బోర్డుపై కూడా వాడు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం ఉంది” అంది తులసి రాత్రి భోజనం ముగిశాక ఆనందరావు మాస్టారితో ఆందోళనగా చెప్తూ.

 

 

ఆనందరావు మాస్టారు నిశ్చలంగా నవ్వి, “తులసీ, సిద్ధార్థ్ లండన్ చదువులు చదివి ఉండవచ్చు. కానీ వాడికి ఈ మట్టి సత్తా తెలీదు. వాడు ఇక్కడికి వచ్చింది కేవలం మైనింగ్ కోసం మాత్రమే కాదు, ఆ ఆధారాలను దొంగిలించడానికి కూడా. పిల్లల విషయంలో నువ్వు భయపడకు. వాళ్లను స్కూలుకు తీసుకెళ్లడం, తీసుకురావడం నేనే స్వయంగా చూసుకుంటాను. నువ్వు నీ ఆఫీస్ ఫైళ్ల పై దృష్టి పెట్టు” అని ధైర్యం చెప్పారు.

మరుసటి రోజు ఉదయం, సిద్ధార్థ్ తన లగ్జరీ కారులో భారీ సెక్యూరిటీతో చింతపల్లె ఐటీడీఏ ఆఫీసులోకి అడుగుపెట్టాడు. కలెక్టర్ తులసి క్యాబిన్ లోకి వెళ్లేటప్పుడు అతని ముఖంలో ఒక రకమైన అహంకారం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. తులసి సీట్లో కూర్చుని ప్రశాంతంగా ఫైల్స్ చూసుకుంటోంది. సిద్ధార్థ్ ఆమెకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుని కాలి మీద కాలు వేసుకొని , తన చేతిలో ఉన్న కొత్త మైనింగ్ ఆర్డర్స్ కాపీని టేబుల్ పై పెట్టాడు.

 

కలెక్టర్ తులసి గారు… నా తండ్రి భార్గవ్ రామ్‌ను, రాజేంద్ర అంకుల్‌ను మీరు జైలుకు పంపి ఉండవచ్చు. కానీ ఈ సిద్ధార్థ్ సామ్రాజ్యం వేరు, నా సామ్రాజ్యాన్ని కదిలించడం మీ వల్ల కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన మైనింగ్ పర్మిషన్ లేఖ. చింతపల్లె కొండల్లో ఉన్న బాక్సైట్ నిక్షేపాలను తవ్వడానికి మా గ్లోబల్ కంపెనీకి పూర్తి హక్కులు ఉన్నాయి. ఇందులో మీరు ఎలాంటి అడ్డంకులు సృష్టించలేరు. ఒకవేళ సృష్టిస్తే, మీ ఐఏఎస్ కెరీర్ ఇక్కడితో ముగిసిపోతుంది” అంటూ డీసెంట్ గానే బెదిరించాడు.

 

తులసి ఆ పేపర్లను ఒకసారి చూసి, సిద్ధార్థ్ కళ్లల్లోకి నేరుగా చూస్తూ లేచి నిలబడింది.  చూడండి మిస్టర్ సిద్ధార్థ్… నీ లండన్ తెలివి తేటలు,  ఈ కార్పొరేట్ ప్లాన్లు ఈ చింతపల్లె అడవి దాటలేవు. ఈ పర్యావరణ అనుమతి పత్రాల వెనుక ఉన్న ఐటీ రిటర్న్స్, నకిలీ సర్టిఫికెట్ల గురించిన పూర్తి నివేదికను నేను ఇప్పటికే సుప్రీంకోర్టు నియమించిన గ్రీన్ ట్రిబ్యునల్ కి పంపించాను. జైల్లో ఉన్న నీ తండ్రికి ఉరిశిక్ష పడటంలో ఏ ఆధారాలైతే కీలక పాత్ర పోషించాయో, అదే ఆధార వివరాలతో నిన్ను కూడా అదే జైలు గదికి పంపడానికి  నాకు ఈ ఒక్క ఫైల్ చాలు” అని గంభీరంగా సమాధానమిచ్చింది. 

 

తులసి మాటలకు సిద్ధార్థ్ ముఖంలో రంగులు మారాయి. చట్టపరంగా తులసిని ఇరుకున పెట్టడం అంత సులువు కాదని అతనికి అర్థమైంది. పగతో రగిలిపోతూ అతడు క్యాబిన్ నుండి విసవిసా బయటకు వెళ్లిపోయాడు.కానీ, సిద్ధార్థ్ అంతటితో ఆగలేదు. ఆఫీసు నుండి బయటకు రాగానే తన పాత అనుచరులకు ఫోన్ చేసి, “తులసిని చట్ట పరంగా ఆపలేం. ఆమెను దెబ్బతీయాలంటే ఆనందరావు మాస్టారు, ఆ పిల్లలిద్దరినీ టార్గెట్ చేయాల్సిందే. రేపు ఉదయం వాళ్లు స్కూలుకు వెళ్లే దారిలోనే నా ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వాలి” అని ఆర్డర్ వేశాడు.

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue