రోజులు గడుస్తున్న కొద్దీ సత్య డాన్స్ అకాడమీ పేరు ఇంకా పెద్దగా వినిపించడం మొదలవుతుంది.
ఒక్కో చోట నుంచి కొత్త కొత్త పిల్లలు రావడం… వాళ్ల పేరెంట్స్ సత్యని కలిసి తమ పిల్లల గురించి చెప్పడం… ఇలా అకాడమీ ఎప్పుడూ సందడిగా మారిపోతుంది.
అయినా సత్య మాత్రం మొదట్లో ఎలా ఉండేదో అలాగే ఉంటుంది.
ఎవరైనా ఫీజు గురించి అడిగితే ముందుగా పిల్లాడి టాలెంట్ చూస్తుంది.
“పిల్లాడికి డాన్స్ మీద నిజంగా ఇష్టం ఉందా?” అని అడుగుతుంది.
“ఉంది మేడమ్” అని పేరెంట్స్ చెబితే, “అయితే ఫీజు గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు వాడి కలని ఆపకండి” అంటుంది.