New Katha Varnika is now on Google Play — read Telugu stories on your phone. Learn more
ఎవరిది ప్రేమ? – 3

ఎవరిది ప్రేమ? – 3

ఆద్య కాలేజీకి వెళ్ళగానే తన ఫ్రెండ్స్ తన దగ్గరకి వస్తూ నవ్వుతూ హాయ్ చెప్పి గుడ్ మార్నింగ్ అని విష్ చేసి మాట్లాడుతూ ఉంటారు..

అబ్బాయిలు మాత్రం కాలేజీ బస్సు దిగిన ఆద్యని అలానే గుడ్లప్పగించి మరీ చూస్తూ అబ్బా ఏమన్నా ఉంటుందిరా ఈ ఆద్య.. ఆ కళ్ళు, ఆ ముక్కు, ఆ లిప్స్ ఒకటేంటిలే టోటల్  మనిషే సూపర్ గా ఉంటుంది…
ఆ బ్రహ్మ అందమంతా పోత పోసి మరీ మన ఆద్య ని తయారు చేసినట్టున్నాడు….ఏమందంరా బాబు అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటె పక్కన వాళ్ళు ఎంత అందం ఉంటె ఏంటిలే,ఎంత మంది ప్రపోజ్ చేసిన పట్టించుకోదు…
నాకు ఈ లవ్వు గివ్వు లకి టైమ్ లేదు అంటుంది…
ఎప్పుడు చూడు పుస్తకాలు అంటూ ఆ లైబ్రరీ చుట్టు, పరిశోదనలు అంటూ ఆ ల్యాబ్ చుట్టు తిరుగుతుంది….
ఈ కాలంలో ఇలాంటి పుస్తకాల పురుగుని, చదువు పిచ్చి వున్న అమ్మాయిని చూడలేదు.. ఏమన్నా అంటే నా గోల్ డాక్టర్ అవడం ,సొంతంగా హాస్పిటల్  పెట్టి అందరికి అందుబాటులో వైద్యం చెయ్యడం,మా అమ్మ, నాన్నలకి మంచి పేరు తేవడం.అదే నా ఆశ, కల అంటుంది….
పోనీ ఇంత అందంగా ఉంది కదా పొగరు, అహంకారం లాంటివి చూపిస్తుందా అంటే  అదేమీ ఉండదు..తను ఎంత అందంగా ఉన్న కాలేజ్ మొత్తం తన ఫాన్స్ ఏ అయిన తను ఎప్పుడు లెవెల్ చూపించదు…
అందరితో ఎంతో మంచిగా ఉంటుంది…ప్రపోజ్ చేసిన సరే హార్స్ గా బిహేవ్ చేయకుండా,చాలా సున్నితంగా నో చెప్తుంది..
తను చెప్పే విధానానికి  ప్రపోజ్ చేసిన వాళ్ళు కూడా కన్విన్స్ అయిపోయి ,తనపై  ఆ ఫీలింగ్ వదిలేసి ఫ్రెండ్ గా ఉండిపోతున్నారు..
ఎంతయినా షి ఇస్ రియల్లీ గ్రేట్ రా ..ఓన్లీ అందమే కాదు అణుకువ, మంచితనం, సున్నితత్వం అన్నీ కలబోస్తే మన ఆద్య….
 కానీ ఆ అందాన్ని చూసి ఆనంందిండడం తప్ప ఏం చేయలేము.. తను తన గోల్ ని తప్ప ఎవరిని లవ్ చేయదు అని నిట్టూరుస్తూ చూసింది చాల్లే పదండి పదండి క్లాస్ లకి టైం అవుతుంది  అంటూ వాళ్ళల్లో వాళ్లే చెప్పుకుంటూ కాలేజీ లోపలకి వెళ్లిపోయారు…
అప్పటివరకు అబ్బాయిల చూపుల్ని, వాళ్ళ మాటల్ని విన్న ఆద్య ఫ్రెండ్స్  నవ్వుతూ హ్మ్ అటు చూడవే అబ్బాయిలంతా  నిన్ను చూసి ఎలా అయిపోతున్నారో  పాపం బిడ్డలు నువ్వంటే పడి చస్తున్నారు….
రోజుకొకడు ప్రపోజ్ చేస్తున్నాడు. ఎవరో ఒకరికి  ఓకే చెప్పొచ్చు కదే పాపం సంతోషిస్తాడు..నీకు కూడా మిగతా వాళ్ళ గోల ఉండదు…
అదే మాకే గనుక నీలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటేనా  ఒక్కొక్కడితో ఆడేసుకునే వాళ్ళం అంటూ ఆద్యకి ఆ అబ్బాయిల్ని చూపిస్తూ ఆటపట్టిస్తారు….
ఫ్రెండ్స్ మాటలకి ఆద్య సీరియస్గా ఒక లుక్ ఇచ్చి  మీకెన్ని సార్లు చెప్పాలే  నా దగ్గర ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడొద్దు అని, నాకు ఈ ప్రేమ గీమా సరిపోవు..
 నాకు వాని గురించి ఆలోచించే అంత టైం, అవసరం రెండు లేవు.. ఇంక ఇంతటితో ఈ టాపిక్ ఆపి సైలెంట్ గా క్లాస్ కి వెళ్తే మంచిది అని చెప్తుంది….
ఆద్య లుక్ కె బయపడిన ఫ్రెండ్స్ నువ్వు మారవ్ లే పద..  మా పిచ్చిగాని నీకు కొత్తగా లవ్,లవర్ ఎందుకు నీ పుస్తకాలే నీ లవ్..నీ చదువే నీ లవర్..అది మాకు తెలిసి కూడా నీకు ఏదో చెప్తాము చూడు మాకు బుద్ది లేదు అంటారు….
హ్మ్ ఆ విషయం తెలుసు కదా ఇంక నోర్లు మూసుకుని పదండి అంటూ క్లాస్ రూమ్ వైపు నడుస్తుంది ఆద్య…
అన్నట్టు చెప్పడం మర్చిపోయా ఆద్య పాప MBBS  2nd  ఇయర్ చదువుతుంది…తనకి ఎంతసేపు చదువు గోల తప్ప ఇంకేం ద్యాస లేదు….
ఎలాగైనా సరే గొప్ప డాక్టర్ అవ్వాలి.. ఫ్రీ సర్వీస్ చెయ్యాలి అన్నది తన కోరిక…ఆ కల నిజం చేసుకోడానికి చాలా కష్ట పడుతుంది….
టైమ్ అసలు వేస్ట్ చేసుకోదు. అందరు సినిమాలు, షికార్లు, షాపింగ్ లు అంటూ తిరుగుతుంటే  ఆద్య పాప  అబ్బాయిలు అన్నట్టు ల్యాబ్ లు, లైబ్రరీల చుట్టు తిరుగుతుంటుంది…
ఫ్రెండ్స్ మరీ బలవంతం చేస్తే ఎప్పుడో ఒకసారి కొంత సమయం వాళ్ళతో కలిసి బయటకి వెళ్ళేది….అప్పుడు కూడా ఏదో ఒక ఫార్ములా అది ఇది అంటూ ల్యాబ్ లో జరిగేవి చెప్తు ఉంటె ఫ్రెండ్స్ దండం పెట్టి కాలేజీ లో ప్రొఫెసర్స్ గోలే భరించలేక, ఆ గోల రిలీఫ్ కోసం ఏదో సరదాగా బయటకి వస్తే నువ్వు ఇక్కడ కూడా అదే గోల ఏంటే బాబు నువ్వు ఆపు అని ఏడుపు మొహం పెట్టి రిక్వెస్ట్ చేస్తారు…
అప్పుడు ఇంక వాళ్ళ మొహాలు చూడలేక, సరేలే మాట్లాడను అని చెప్పి కొద్దిసేపు వాళ్ళతో సరదాగా ఉండి ఇంటికి వెళ్ళేది….
ఆ వేస్ట్ అయిన కాస్త టైమ్ ని కూడా నైట్ టైం అర్ధరాత్రి వరకు కూర్చుని చదువుకునేది…అలా ఇల్లు, అమ్మ నాన్న కాలేజీ, ఫ్రెండ్స్, పుస్తకాలు ఇవే తన ప్రపంచంగా పెరుగుతుంటుంది ఆద్య ….
అలా రోజులు సాఫీగా గడిచిపోతున్నాయి….
ఆద్య వాళ్లకి కాలేజీ స్టార్ట్ అయి 2 నెలలు దాటింది….
ఒక రోజు ఆద్య వాళ్ళు క్లాస్ లో ఉన్న టైమ్ లో  ఒక అబ్బాయి ఎస్క్యూజ్ మీ సార్ మే ఐ కమిన్ అని అడుగుతాడు….
జరుగుతున్న క్లాస్ మధ్యలో సడన్ గా అలా వాయిస్ వినిపించేసరికి ప్రొఫెసర్ తో సహా అందరు ఎవరు అన్నట్టు తల తిప్పి చూస్తారు….
అక్కడ ఒక ఇరవై ఏళ్ల అబ్బాయి నిలబడి చూడడడానికి ఎంతో హ్యాండ్సమ్ గా ఉన్నాడు….అమ్మాయిలు అందరు ఆ అబ్బాయిని అలా చూస్తుండిపోయారు…. (ఒక్క ఆద్య తప్ప.)
అతన్ని చూస్తూ అబ్బో వీడెంటి మరీ ఇంత అందంగా ఉన్నాడు.. అయినా ఎవరు ఇతను క్లాస్ మధ్యలో వచ్చాడు అనుకుంటూ ఉన్నారు మనసులో ఎవరికి వారు..
వాళ్ళ అందరి డౌట్ తీర్చడానికి అన్నట్టు ప్రొఫెసర్ అతని వంకే సూటిగా చూస్తూ హూ ఆర్ యూ మిస్టర్? వాట్ డు యూ వాంట్ అని అడుగుతాడు….
అందరు అతను ఏం చెప్తాడా అన్నట్టు చూస్తుంటే వచ్చిన అబ్బాయి ఐయామ్ న్యూ జాయినింగ్ సార్ అని చెప్తాడు.
అతని మాటకి అందరు కాలేజీ స్టార్ట్ అయిన 2 మంత్స్ కి న్యూ జాయినింగ్ ఏంటి అన్నట్టు చూస్తుంటే..ప్రొఫెసర్ మాత్రం ఓహ్ మన డీన్ చెప్పింది నీ గురించేనా ఓకే కమ్ అండ్ సిట్ అని ఆ అబ్బాయికి చెప్పి స్టూడెంట్స్ వైపు తిరిగి ఇతను మొన్నటివరకు ఫారిన్ లో చదువుకునేవాడు…
బట్ ప్రెసెంట్ కొన్ని రీసన్స్ వల్ల ఫారిన్ నుండి వాళ్ళ ఫ్యామిలీ రీసెంట్ గా ఇక్కడకి వచ్చేయడంతో తను లేట్గా మన కాలేజీ లో జాయిన్ అయ్యాడు….ఇతని నేమ్ “రాఖీ”..తనకి మీరే ఇన్ని డేస్ జరిగిన క్లాస్సేస్ ఎక్సప్లయిన్ చేయండి  అని చెప్తాడు…
అబ్బాయిలంతా అమ్మాయిలు అతన్ని చూడడం, రాఖీ వాళ్ళకంటే అందంగా ఉండడంతో, ఏంటి వీడు మా క్లాస్లో ఉంటాడా ?
ఇలాంటివాడు మా క్లాస్ లో ఉంటె ఇంక ఈ అమ్మాయిలు మమ్మల్ని ఏం చూస్తారు, ఓహ్ గాడ్ ఏంటి మాకి కర్మ అని  లోపల తిట్టుకుంటూ పైకి మాత్రం ఒక స్మైల్ ఇచ్చి గుడ్ స్టూడెంట్స్ లా ఓకే సార్ అని చెప్తారు….
ఆద్య సార్ చెప్పేది మాత్రమే వింటుంది తప్ప తల అటు ఇటు తిప్పను కూడా లేదు…
రాఖీ ఒక బెంచ్ దగ్గరకి వచ్చి కూర్చుని తన పక్కన వాళ్ళని పరిచయం చేసుకుంటాడు…
 సార్ క్లాస్ స్టార్ట్ చేస్తాడు..
రాఖీ క్లాస్ మొత్తం ఒకసారి తన కళ్ళతోనే చూసి ఆద్య దగ్గర ఒక సెకన్ చూపు ఆపి, వెంటనే తల తిప్పేసి క్లాస్ వినడం మొదలు పెడతాడు..
continued….