New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ప్రేమదేశం యువరాణి 💘

ప్రేమదేశం యువరాణి 💘

ప్రేమదేశం యువరాణి 1

 

అమ్మ మీను తొందరగా రా అమ్మ కాలేజీకి టైం అవుతుంది. ఆ వస్తున్నాను అమ్మ అయిదు నిమిషాలు గదిలో రెడీ అవుతున్న కూతుర్ని వసుంధర కిచెన్ లోకి నుంచి గట్టిగా పిలిచింది.

 

 

కాలేజీకి రెడీ అవుతున్న మీనాక్షి తన బ్యాక్ సర్దుకొని అద్దంలో తనని తాను ఒకసారి చూసుకుని అంతా ఓకే అనుకున్న తర్వాత తన కాలేజ్ బ్యాగ్ తీసుకుని తన గదిలోంచి బయటికి వచ్చింది.

 

 

అమ్మా నేను రెడీ తొందరగా టిఫిన్ పెట్టు గట్టిగా అరిచింది.

 

 

రోజు నీకు ఇది అలవాటైపోయింది లేటుగా లేవడం కాలేజీ టైంకి హడావిడి చేసి టిఫిన్ తినకుండా వెళ్ళిపోవడం…..

 

 

రేపటి నుంచి లేటుగా లేచావంటే చూడు నేను అసలు ఒప్పుకోను సారీ మా చెవి పట్టుకుని చిన్న పిల్ల ముద్దు ముద్దుగా చెప్పింది.

 

 

కూతురు అమాయకమైన మొహం చూసి వసుంధర ఫక్కున నవ్వుతూ ఈ వేషాలకేం తక్కువ లేదు ఇలా చేసి నన్ను నీ మీద కోప్పడకుండా ఉండేలా చేస్తున్నావు.

 

 

 సర్లే కానీ ఇంతకీ నీ సెమిస్టర్ ఫీజు ఎప్పుడు కట్టాలో చెప్పు…..

 

 

నీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ కదా ఈ లోపు ఫీజు కట్టేస్తాను. హా మా ఇంకా సెమిస్టర్ కి టైం ఉంది.  నేను నీకు చెప్తాను సరే ఒక పది రోజులు ముందు చెప్పు నేను కూడా డబ్బులు ఆరెంజ్ చేయాలి కదా?

 

 

అలాగే మా తల్లి కూతుర్ల ఇద్దరూ టిఫిన్ చేసి మధ్యాహ్నానికి లంచ్ కూడా ప్యాక్ చేసుకుని ఇంటికి తాళం వేసి వసుంధర నేరుగా కూతురి స్కూటీ ఎక్కింది.

 

 

వాళ్ళ అమ్మని తన పని చేసే స్కూల్ దగ్గర డ్రాప్ చేసి  తన స్కూటీ మీద కాలేజీకి బయలుదేరింది. వసుంధర గారు లోపలికి వస్తుంటే స్కూల్లో స్టాప్ అందరు అమెని ఎంతో గౌరవంగా గుడ్ మార్నింగ్ మేడం విష్ చేశారు.

 

 

ఆమె నవ్వుతూ అందరిని ఎంతో  ఆప్యాయంగా పలకరిస్తు స్టాఫ్ రూమ్ లోకి వెళ్లి రిజిస్టర్లో సంతకం చేసి తన క్లాస్ కి వెళ్ళిపోయారు.

 

 

మీను కాలేజ్ కి బయలుదేరింది కానీ సడన్గా తనకొక విషయం గుర్తొచ్చి అబ్బా నేను ఈరోజు కూడా ఈ విషయం మర్చిపోయానా?

 

 

అమ్మకి చెప్పాలనుకుంటున్నాను మర్చిపోతున్నాను. ఈవినింగ్ అమ్మ కి ఈ విషయం ఖచ్చితంగా చెప్పాలి లేకపోతే అమ్మ చాలా సీరియస్ అవుతుంది అనుకుంటూ కాలేజీకి బయలుదేరిన తనకి తన కాలేజీ రూట్లో ట్రాఫిక్ జామ్క కనిపించింది.

 

 

అబ్బా ఏంటిది రోజు ఇక్కడ ఇంత ట్రాఫిక్ ఉండదు కదా ఈరోజు ఏంటి ఇంత ట్రాఫిక్ ఉంది. ఎప్పుడు ఇది క్లియర్ అవుతుందో ఏంటో?

 

 

అసలే మీను కాలేజ్ డెమో ఇవ్వాలి అని లేట్ అవుతుందని కంగారుపడుతూ ఉంటుంది కానీ ఎంతసేపటికి ట్రాఫిక్ క్లియర్ కాకపోవడంతో తనకి చాలా చిరాగ్గా ఇంకా కోపం వస్తుంది.

 

 

పక్కనే ఉన్న వాళ్ళతో ఏమైందండీ ఎందుకు ఇంత ట్రాఫిక్ అయింది అసలు కదలటం లేదు?

 

 

ఏం జరిగింది ఆక్సిడెంట్ అయిందా? తెలీదమ్మా మేము కూడా చాలాసేపటి నుంచి చూస్తున్నాం పైగా నేను కూడా ఆఫీస్ కి వెళ్ళాలి. 

 

 

ఎందుకు సడన్ గా ఇలా ట్రాఫిక్ జామ్ అయిందో అర్థం కావడం లేదు అని ఆ వ్యక్తి కూడా అన్నాడు.

 

 

ముందున్న బండి మీద ఉన్న వ్యక్తి మీకు తెలియదా?  వర్మ వారసుడు అమెరికా నుంచి వస్తున్నాడంట అతని కోసమే ఇలా రోడ్లన్నీ బ్లాక్ చేశారు.

 

 

మీకు తెలుసు కదా ఈ సిటీలో ఆ వర్మ కుటుంబాన్ని ఎదిరించి ఎవరూ ఏం చేయలేరు పైగా దాదాపు ఐదు సంవత్సరాల తర్వాత ఆయన వస్తున్నాడు.

 

 

ఆయన కోసమే ట్రాఫిక్ ని జామ్ చేశారు. అతను ఏర్పోర్ట్ నుంచి ఇంటికి వెళ్లేదాకా రోడ్లన్నీ ఇలాగే ఉంటాయి అతను వెళ్ళిన తర్వాతే మనము వెళ్ళేది.

 

 

అతను తనకు తెలిసింది చెప్పాడు. అవునా అంటే అమెరికా నుంచి విహారి వర్మ గారు వస్తున్నారన్నమాట…..

 

 

అవును ఆయన వస్తున్నాడని నిన్నటి నుంచి సిటీ మొత్తం కోలాహలంగా ఉంది. పైగా వర్మ అంపైర్ కి మొదటి వారసులు అతని కోసమే కదా ఇంతకాలం వర్మ కంపెనీస్ అన్నీ ఎదురుచూస్తున్నాయి…..

 

 

ఎట్టకేలకు ఆయన వారసుడు ఈరోజు రాబోతున్నాడు అంట….. సరిపోయింది ఈ విషయం తెలిసుంటే కొంచెం ముందు బయలుదేరి ఆఫీస్ కి వెళ్ళేవాన్ని ఇప్పుడు ఈ ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అవుతుందో ఏంటో అని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు.

 

 

వర్మ వారసుడా విహారి వర్మ ఎవరి గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అయినా ఆయన అంత పవర్ఫుల్ ఆయన కోసం రోడ్లన్నీ బ్లాక్ చేశారు.  ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి అని ఆలోచిస్తూ ఉంది మీను….

 

 

మరోవైపు తన ప్రైవేట్ చాపర్ లో వర్క్ చేసుకుంటున్నా మన హీరో గారి కళ్ళ ముందు ఒక ఫోటో పెట్టాడు.

 

 

అతని అసిస్టెంట్ ఆ ఫోటోని చూసి అసిస్టెంట్ తో తిరిగి ఏమైనా సరే ఈ అమ్మాయి నాకు కావాలి…. ఆ ఫోటోని అలా చూస్తూ ఉండిపోయాడు మన ఆరడుగుల అందగాడు విహారి వర్మ.

 

 

ఇది నా మొదటి స్టోరీ తప్పులేమన్నా ఉంటే క్షమించండి….

 

ఇగ్నోర్ మిస్టేక్స్….