సహస్ర ఆ ఇద్దరి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, “మీ ఇద్దరికీ ఒకరికొకరు తెలుసా?” అని అడిగేసరికి,
హాల్లో అందరూ నిశ్శబ్దంగా మారిపోయారు…. రాఘవేంద్ర అద్వైత్ వైపు చూశాడు….
అద్వైత్ మాత్రం చాలా సీరియస్‌గా నిలబడి ఉన్నాడు….
సహస్ర మళ్లీ, “సార్… ఏం జరుగుతోంది?” అని అడిగింది…..
అద్వైత్ ఆమె వైపు చూసి, “సహస్ర… ముందు నువ్వు కంగారు పడకు” అన్నాడు…..
దాంతో సహస్ర, “కంగారు పడకుండా ఎలా ఉంటాను సార్… మీరు ఇలా మా ఇంటికి ఎందుకు వచ్చారు?” అని అడిగింది…..