New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమండోయ్ మాస్టారు 💞 – 3

ఏమండోయ్ మాస్టారు 💞 – 3

నెక్స్ట్ డే మార్నింగ్….

 

సహస్ర నార్మల్గానే రెడీ అయ్యి కాలేజీకి వచ్చింది…. అప్పటివరకు ఆలోచనలో మునిగిపోయి ఉన్న ఆమె ఈరోజు సార్ ఏం చేయబోతున్నారు అని ఆలోచిస్తూ కాలేజీలోకి ఎంటర్ అవుతుంది  …

 

అలసిపోయిన మొహంతో, ముఖంలో ఏదో బాధతో తన క్లాస్ రూమ్ లోకి వెళ్లి సీట్లో కూర్చుంటుంది….

 

ఆమెను చూసిన నిహారిక వెంటనే తన దగ్గరకు వచ్చి నిన్న ఎందుకు రాలేదు అని కంగారుగా అడుగుతుంది….

 

సహస్ర దించుకొని ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది….

 

ఒసేయ్ మూగమొద్దా నీకు ఎన్నిసార్లు చెప్పాను ఇలా ఉండొద్దని అని కోపంగా నిహారిక అడిగేసరికి,

 

నీకు తెలుసు కదా ఇంట్లో వాళ్ళందరూ పెళ్లి విషయం గురించి మాట్లాడుతున్నారు….

 

ఆ మాట విన్న నిహారిక కి  కోపం పెరిగిపోతుంది… 

 

మరి నీకు పెళ్లి ఇష్టం లేదని ఇంట్లో వాళ్ళతో మాట్లాడావా అని కళ్ళు చిన్నవి చేసి నిహారిక అడిగేసరికి,

 

మాట్లాడాను కానీ అని మౌనంగా ఉన్న తనని చూస్తున్నా నిహారిక,

 

ఏంటి అని సీరియస్గా అడుగుతుంది…..

 

చెప్పాను కదా ఇంట్లో వాళ్ళు ఎవరు నా మాట వినే స్టేజ్లో లేరు అని కన్నీళ్లు పెట్టుకుంటుంది సహస్ర…

 

అప్పుడే బూట్ల చప్పుడు వినిపిస్తుంది….

 

క్లాస్ రూమ్ లోకి వస్తున్న అద్వైత్ ని చూసి ఇద్దరు సైలెంట్ గా కూర్చుంటారు….

 

అద్వైత్ ని చూసిన సహస్ర బాధగా అతని కళ్ళల్లోకి చూస్తూ ఉండిపోయింది….

 

అద్వైత ఆమె వైపు చూసి సహస్ర ఒకసారి బయటికి రా అని చిన్నగా చెప్పి బయటకు వెళ్ళిపోతాడు….

 

క్లాస్ రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ అందరూ ఒక్కసారిగా సహస్త్రని  చూస్తారు….

 

వాళ్ల చూపులు తెలుస్తున్న సైలెంట్ గా బయటకు వెళ్తుంది సహస్ర….

 

క్లాస్ కి కొంచెం దూరంగా నుంచన్న అద్వైత్ దగ్గరికి వెళ్తుంది సహస్ర….

 

అద్వైత్ కోపంగా ఆమె వచ్చిన తర్వాత నిన్న ఎందుకు కాలేజీకి రాలేదు అని సీరియస్గా అడుగుతాడు….

 

సహస్ర మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది….

 

నేను నిన్నే అడుగుతుంది అని సీరియస్గా అడుగుతాడు అద్వైత్….

 

ఇంట్లో పరిస్థితులు బాలేవు సార్ అని చిన్నగా చెప్తుంది….

 

ఏమైంది అని అతని వాయిస్ బేస్ లో వినిపించేసరికి,

 

సహస్ర మౌనంగా ఉండిపోతుంది…. కమాన్ స్పీక్ అవుట్ అని వాయిస్ బేస్టోన్లో వినిపించేసరికి,

 

ఆమె నోరు విప్పి పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నారు సార్ అని బాధగా చెప్తుంది….

 

ఆమె చెప్పిన మాట విన్న అద్వైత్ మొహం ఎర్రగా మారిపోతుంది…. చేతి పిడికిలి బిగించుకొని వస్తున్న కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు….

 

ఇంత తొందరగానా అని ఆశ్చర్యపోతూ అడుగుతాడు….

 

వచ్చే నెల పెళ్లి అంటున్నారు సార్ అని కన్నీళ్ళతో చెప్తుంది సహస్ర….

 

మరి మీ చదువు పరిస్థితి ఏంటి అని సీరియస్గా అడిగేసరికి,

 

ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోతుంది సహస్ర….

 

అద్వైత్ చూపులు ఆమెకు తాకుతున్నా సరే తలదించుకొని ఉండిపోతుంది….

 

కొంచెంసేపు ఆమెని దీక్షనంగా చూసిన అద్వైత్, నువ్వు నాకు నిజం చెప్పాలి సహస్ర అని సీరియస్ గా మాట్లాడతాడు…..

 

సహస్ర ఒకసారిగా తలపైకి ఎత్తి అతని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తుంది….

 

ఆమె చూపులను తప్పించుకుంటూ మొహం పక్కకు తిప్పుకుంటాడు….

 

సార్ అని చిన్నగా నోరు విప్పుతుంది…

 

నీకేం కావాలి సహస్ర అని అతని వాయిస్ లో గొంతులో వినిపించేసరికి,

 

అతని మాట విన్న సహస్ర వెంటనే కళ్ళల్లో కన్నీళ్లు కారిపోతాయి….

 

నేను బాగా చదువుకోవాలి సార్ అని ఏడుపు గొంతుతో మాట్లాడుతుంది….

 

అద్వైత ఒక క్షణం ఆలోచనలో పడతాడు….. నీకు పెళ్లి ఇష్టం లేకపోతే ఇంట్లో చెప్పాలి కదా సహస్ర అని సీరియస్ గా అడిగేసరికి,

 

చెప్పాను సార్ కానీ అర్థం చేసుకోలేదు….

 

మళ్లీ చెప్పు అని అతని వాయిస్ వినిపించేసరికి,

 

సహస్ర ఆశ్చర్యంగా అతని వైపు చూస్తుంది….. ఏంటి సార్ అని అయోమయంగా అడుగుతున్న సహస్రాని చూసి,

 

వాళ్లకి అర్థమయ్యేంతవరకు చెప్పు సహస్ర అని సీరియస్ గా చెప్తాడు అద్వైత్…

 

ఆ మాట విన్న సహస్ర బాధగా వాళ్లు నా మాట అసలు వినే స్టేజ్ లో కూడా లేరు సార్ అని ఏడుపు గొంతుతో మాట్లాడుతుంది….

 

అద్వైత చిన్నగా కానీ ఒక్క విషయం గుర్తు పెట్టుకో సహస్ర అన్నాడు….

 

ఏంటి సార్ అని లో గొంతులో వినిపిస్తున్న ఆమె వాయిస్ కి,

 

నీకోసం ఇంకెవరో నిర్ణయం తీసుకుంటారని ఎదురు చూడకు…. ముందు నీకేం కావాలో నువ్వు గట్టిగా చెప్పడం నేర్చుకో అని అతని వాయిస్ బేస్ లో వినిపిస్తుంది….

 

సహస్ర అతని మాటలకి అలానే చూస్తూ ఉండిపోతుంది….

 

సార్ అని నెమ్మదిగా పిలిచేసరికి,

 

ఏంటి అని చిన్నగా అడుగుతాడు అద్వైత్….

 

నెమ్మదిగా మీరు నాకెందుకు హెల్ప్ చేస్తున్నారు సార్ అని చిన్నగా అడుగుతుంది సహస్ర….

 

అద్వైత్ కాసేపు ఆమెనే చూస్తూ ఉండిపోతాడు….

 

తర్వాత ఎందుకంటే నువ్వు భయపడుతూ నీ జీవితం వదిలేయడం నాకు నచ్చలేదు…

 

అతని నోటి నుండి వచ్చిన మాట విని ఒక్కసారిగా ఆశ్చర్య పోతుంది సహస్ర…

 

ఎందుకో తెలియదు ఆమెకు ఒక చిన్న ఆశ కలుగుతుంది…. తన మీద తనకి నమ్మకం కలిగేలా క్రియేట్ చేస్తాడు అద్వైత్….

 

సార్ అని మళ్లీ పిలవడంతో, అద్వైత్ వెనక్కి తిరిగి ఏంటి అని అడుగుతాడు….

 

కొంచెం దూరంలో కనిపిస్తున్న వ్యక్తిని చూసి అతని మొహం ఎర్రగా మారిపోయి రుద్ర రూపం దాలుస్తుంది….

 

అతని ఎవరో కాదు అర్జున్ సహస్రకు కాబోయే భర్త….

 

అర్జున్ నెమ్మదిగా వాళ్ళ దగ్గరికి వచ్చి వారిద్దరిని చూసేసరికి, ఒక్కసారిగా కంగారు పడిపోతుంది సహస్ర….

 

భయంగా మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడిగింది సహస్ర….

 

అర్జున్ సహస్రాన్ని చూస్తూ నిన్ను తీసుకు వెళ్ళడానికి వచ్చాను అని చిన్నగా చెప్తాడు…..

 

ఎక్కడికి అని చిన్నగా అడుగుతుంది సహస్ర….

 

ఇంటికి అని అర్జున్ వాయిస్ కాస్త సీరియస్గా వినిపించేసరికి,

 

ఆమె లో లోపలే భయపడుతూ నేను కాలేజీలో ఉన్నాను…. ఇప్పుడు ఇంటికి రాలేను అని కంగారుగా చెప్తుంది….

 

ఈరోజు నుండి నువ్వు కాలేజీకి రావలసిన అవసరం లేదు అని మీ ఇంట్లో వాళ్ళు చెప్పారు అన్న మాటలు అర్జున్ నోటి నుండి వస్తాయి….

 

ఆ మాట విన్న సహస్ర మొహం ఒక్కసారిగా బాధగా మారిపోయింది….

 

ఏంటి అని అద్వైత్ సీరియస్గా అర్జున్ వైపు తిరిగి చూస్తాడు….

 

ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు అని అర్జున్ అతని వైపు సీరియస్ గా చూసేసరికి,

 

అయినా ఇది మా ఫ్యామిలీ డిసిషన్ సార్ మీరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు అని సీరియస్ గా చెప్తాడు అర్జున్….

 

సహస్ర భయంతో ఒక్క అడుగు వెనక్కి వేస్తుంది…. ఇప్పుడు చెప్తున్నాను కదా ఇంటికి వెళ్దాం పద అని సీరియస్ అవుతాడు అర్జున్….

 

అర్జున్ మాటల్లోని నిర్లక్ష్యాన్ని చూసిన అద్వైత్ కి కోపం పెరిగిపోతుంది….

 

కానీ తన కోపాన్ని బయటకు చూపించకుండా కంట్రోల్ చేసుకోవడానికి ఒక్కసారిగా రెండు కళ్ళు మూసుకుంటాడు….

 

పిడికిలి బిగించి లోపల నుండి వస్తున్న కోపాన్ని అనుచుకునే ప్రయత్నం చేస్తాడు….

 

సహస్ర వైపు తిరిగి నువ్వేం చేయాలనుకుంటున్నావు అని చిన్నగా అడుగుతాడు అద్వైత్…

 

సహస్త్ర చేతులు వణికిపోతూ ఒక వైపు ఇంట్లో వాళ్ళ మాట, ఇంకొక వైపు అద్వైత్ సార్ చెప్పిన మాట ఏదో తేల్చుకోవాలో అర్థం కాకుండా భయంతో వణికి పోతుంది…..

 

తన చదువు ఏమైపోతున్నావని ఇంకొక వైపు భయంతో ఆమె నోటి నుండి మాటలు రావు….

 

నుదుటికి పడుతున్న చెమటల్ని చూసి వణికిపోతున్న తనని చూస్తున్న అద్వైత కోపంగా నువ్వు ముందు భయపడడం ఆపు అని సీరియస్ గా అరుస్తాడు….

 

అతని మాటలు ఆమె చెవిలో రిపీటెడ్ గా వినిపిస్తాయి….

 

సహస్ర నెమ్మదిగా తలపైకి ఎత్తి అర్జున్ వైపు చూసింది….

 

నేను కాలేజ్ మానేయలేను అని ఒక్కసారిగా గట్టిగా అర్జున్ తో చెప్పేసరికి షాక్ అయిపోతాడు అర్జున్….

 

ఏంటి అని కళ్ళు పెద్దవి చేసి అడుగుతున్న అర్జున్తో,

 

నేను నా చదువు పూర్తి చేస్తాను అని స్ట్రాంగ్ గా చెప్తుంది సహస్ర….

 

అర్జున్ కోపంగా సహస్త్ర అని గట్టిగా అరుస్తాడు….

 

ప్లీజ్ నన్ను మధ్యలో ఆపొద్దు అని మొదటిసారి ధైర్యం చేసి సహస్ర మాట్లాడింది….

 

అద్వైత్ ఏం మాట్లాడకుండా ఆమె వైఫై చూస్తూ ఉండిపోతాడు….

 

సహస్త్రల కళ్ళల్లో ఇంకా భయం ఉంది కానీ బయటపడకుండా దాన్ని ధైర్యం అనే ముసుగుతో కవర్ చేసుకుంటుంది…..

 

నాకు పెళ్లి గురించి ఇప్పుడే మాట్లాడాలని లేదు అర్జున్ గారు అని నెమ్మదిగా చెప్తుంది….

 

అర్జున్ మొహం ఒక్కసారిగా మారిపోయింది ఇది నీకు ఒక్కదాని నిర్ణయం కాదు అని సీరియస్గా మాట్లాడతాడు….

 

సహస్ర వెంటనే ఇది నా జీవితం గురించి అయితే నా మాటే నా నిర్ణయం గా ఉంటుంది….

 

నా జీవితాన్ని ఇంకొకరు రూల్ చేస్తానంటే ఎలా చూస్తూ ఉండగలను అని స్ట్రాంగ్ గా మాట్లాడుతుంది సహస్త్ర….

 

ఆమె మాటలు విన్న అద్వైత కళ్ళల్లో మొహంలో చిన్న సంతోషం వచ్చి చేరుతుంది….

 

అర్జున్ కోపంగా, ఇప్పుడు కాదు నీ సంగతి ముందు ఇంటికి రా అప్పుడు మాట్లాడుకుందాం అని చెప్తాడు….

 

సహస్ర ఒక్కసారి అద్వైత్ వైపు చూసేసరికి,

 

అతను నెమ్మదిగా వెళ్ళు కానీ నీ మాట మీద నీకు నమ్మకం ఉండాలి అని మాత్రమే మాట్లాడతాడు…

 

సహస్ర తల ఊపి అక్కడనుండి తన బ్యాగ్ తీసుకొని క్లాసులో నుండి అర్జున్తో కలిసి ఇంటికి బయలుదేరుతుంది…..

 

అద్వైత్ మాత్రం వాళ్లు వెళ్లిపోయే వరకు అక్కడే నిలబడి చూస్తూ ఉండిపోతాడు….

 

అతని మనసులో మాత్రం ఒకటే ఆలోచన….. ఈసారి సహస్ర నిజంగా తనకోసం తన నిలబడగలుగుతుందా లేదా అని ఆలోచన చేస్తూ మళ్ళీ క్లాసులోకి వెళ్ళిపోతాడు….

 

సాయంత్రం….

 

సహస్ర ఇంట్లో అందరూ ఆమె కోసం ఎదురుచూస్తున్నారు…. ఆమె లోపలికి అడుగుపెట్టగానే ఆమె తండ్రి సీరియస్ గా ఆమె వైపు ఒక చూపు చూస్తాడు…..

 

సీరియస్ గా ఇప్పటినుండి నువ్వు కాలేజీకి వెళ్లాల్సిన అవసరం లేదు అని తండ్రి మాట్లాడేసరికి, కాసేపు మౌనంగా ఉండిపోతుంది సహస్ర….

 

నెమ్మదిగా పైకి తల ఎత్తి నాన్న నేను మీతో మాట్లాడాలి అని ఈసారి గొంతులో భయం కంటే ధైర్యంగా మాట్లాడడానికి సిద్ధపడుతుంది సహస్ర….

 

                  మీ chinni ♥️