అన్నయ్య రిలాక్స్ అన్నాడని రిలాక్స్ అవ్వకండె.. రికార్డ్ తో పాటు యాభై పేజీలు ఈ అనాలసిస్ కూడా రాయాలి లేదంటే మరో పనిష్మెంట్ ఇస్తాడు స్టార్ట్ చేయండి అంది కృతిక…
బుద్ది లేకుండా ఇంకా అన్నయ్య కన్నయ్య అంటున్నావా.. వాడు నిన్ను చెల్లిలా ట్రీట్ చేశాడా??? మాతో పాటు నీక్కూడా పనిష్మెంట్ ఇచ్చాడు వాడో అన్నయ్య అని వాడి గురించా కథలు కథలుగా చెప్పావ్ అని కసిరింది శాన్వి..
అబ్బాహ్! శాను మీకు తప్ప ఎవరికీ తెలియదే క్రిష్ సర్ నా అన్నయ్య అని అందుకే మీతో పాటే నాక్కూడా పనిష్మెంట్ అని చెప్పింది..
ఇంకో విషయం ఏంటి అంటే ఈ కాలేజ్ కృతి వాళ్లదే అన్న విషయం కూడా శాన్వి, గీత లకి తెలియదు..