New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమ్ మాయ చేసావే..!! – 23

ఏమ్ మాయ చేసావే..!! – 23

శాను ఆపవే అంటున్న గీత నే చూస్తూ ఊహు చెప్పకు అన్నట్టుగా పెదవులపై వేలు పెట్టుకుని అడ్డంగా తల ఊపుతూ శాన్వి మాటలనే వింటున్నాడు..

 

 

ఓసేయ్! కృతి!! నీ అన్న కొండముచ్చు మొహం వేసుకొని సీరియస్ గా చూస్తే భయపడాలా?? అసలు మనిషన్న వాడు ఎవడైనా ఇన్ని… అని బుక్ మొత్తం తిరగేస్తూ ఇన్ని పేజీలు రాస్తాడా??? ఇది మాత్రమే కాక ఇంకో యాభై పేజీలు కూడా రాయమన్నాడు ఆ సీరియస్ సింహానికి అసలు మనసు ఉందేంటే అని ఫ్లో లో ఏదేదో వాగుతున్న శాన్వి మాటలని ఆపుతూ…

 

 

చాలు శాను! ఆపు ఇక!! మా అన్నయ్యని ఆడిపోసుకున్న కాడికి చాలు!!  అన్ని మూసుకొని నోట్స్ రాసుకో అని కసిరి కింద పడ్డ పెన్ కోసం వంగిన కృతి కి డోర్ దగ్గర స్టైల్ గా క్రిష్ కాళ్ళు కనిపించడంతో అన్నయ్య అని భయంగా లేచి నిల్చుంది…

 

 

కృతిని చూసి గీత కూడా నిల్చుంటే ఆ సోది మొహం తన క్లాస్ లో మాత్రమే నిల్చొమ్మని చెప్పాడు అంటున్న శాన్వి తలపై ఒక్కటేసి సర్! వచ్చారు అని చెప్పింది కృతిక…

 

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue