పల్స్ పడిపోయి డ్రిప్స్ పెట్టేసరికి షివరింగ్ స్టార్ట్ అయింది.. అందుకే ఇలా హ్యాండ్ రబ్ చేస్తున్న నేను చూసుకుంటా కానీ నువ్వెళ్ళి తినేసి రా అని మరోసారి చెప్పాడు…
ఒక్క పూట తినకపోతే ఏమ్ అవ్వదు సర్ నేను నా ఫ్రెండ్ దగ్గరే ఉంటా అని మొండిగా చెప్పింది కృతిక…
కృతి ఇలా తినకుండానే నీ ఫ్రెండ్ ఈ స్థితికి వచ్చింది.. వెళ్లి తినేసిరా అన్నాడు కాస్త అసహనంగా…
ఓహ్! అవునా!! అయితే మీరే వెళ్లి తినండి సర్ మీకు ఆకలిగా ఉందేమో కానీ నాకు లేదు… నేను నా ఫ్రెండ్ దగ్గరే ఉంటాను లంచ్ టైం అయిపొయింది అంటే మళ్ళీ క్లాస్ కి వెళ్ళాలి అంది కోపంగా…