నేను ఎలా పడిపోయాను అనేది పక్కన పెట్టు ఆ హిట్లర్ గాడిని ఎందుకు నా దగ్గర వదిలేసి వెళ్ళావ్.. వాడికి ఒళ్ళంతా కొవ్వే… నాకు వస్తున్న కోపానికి అని పక్కనే ఉన్న సిసర్ పట్టుకుని నలిపేస్తుంటే…
ఏయేయ్! ఆగవే!! అని ఏమ్ జరిగిందో అర్థం కాక ఒకరి మొహం ఒకరు చూసుకుని నేను అన్నయ్య ని నీ దగ్గర వదిలేయడం కాదు శాను.. నువ్వలా పడిపోగానే అన్నయ్యే నిన్నేత్తుకొని ఇక్కడికి తీసుకు వచ్చి మమ్మల్ని ఇక్కడకి రాకుండా నిన్ను దగ్గరుండి చూసుకున్నాడు కానీ ఏమైంది ఎందుకలా అన్నయ్య ని తిడుతున్నావ్ మళ్ళీ గొడవలు పడ్డారా అని అడిగింది కృతి
నిజామా! అన్నట్టుగా శాన్వి ఆశ్చర్య పోతే అప్పుడే లంచ్ చేసి వచ్చిన నర్స్ ఇప్పుడెలా ఉందమ్మా!! అని అడిగింది
బానే ఉన్నాను ఆంటీ అని శాన్వి చెప్పడంతో బాగున్నావా! ఓ గంట క్రితం ఎంత అల్లడించావో తెలుసా మమ్మల్ని.. పాపం క్రిష్ సర్ అయితే ఎంత టెన్షన్ పడ్డారో నా మీద అరిచి మరి వెంటనే డాక్టర్ ని రప్పించారు… నిన్ను అడ్మిట్ చేసినప్పటి నుండి నువ్వు కళ్ళు తెరిచే వరకు నీ బాడీ షివరింగ్ కి చాలా కంగారు పడ్డారు… ఎన్ని టెన్షన్స్ ఉన్నా టైం టూ టైం ఫుడ్ తీసుకోవాలమ్మా అని చెప్పింది ఆ నర్స్…