New Katha Varnika is now on Google Play — read original stories on your phone. Learn more
ఏమ్ మాయ చేసావే..!! – 37

ఏమ్ మాయ చేసావే..!! – 37

అవసరమా!! నీకు ఈ టెన్షన్ లు చదువుకునే పిల్లవి ప్రశాంతంగా చదువుకోకుండా అనవసరమైన తల భారాలు తలకేక్కించుకోవడం ఎందుకు?? ఆ షాప్ నా కూతురి పేరు మీద రాస్తే ఎవరికీ ఏ టెన్షన్ లేకుండా నేను చూసుకుంటా కదా!! అర్థ రాత్రి ఆడవాళ్లు అలా హాస్పిటల్లో తిరగడం ఏమైనా బాగుందా?? ఆ షాప్ నా చేతుల్లో ఉంటే అన్ని నేను చూసుకుంటాను కదా అన్నాడు

 

 

శాన్వి మోహంలో  కోపం లేదు ఆ స్థానంలో ఒకలాంటి అసహ్యం ఆవరించింది.. దాంతో అయిపోయిందా చెప్పడం? అంది చాలా నిశ్శబ్దంగా గంభీరంగా.. ఆ నిశ్శబ్దం వెనుక ఎంతటి తుఫాను ఉందో రాజీవ్ గ్రహించలేకపోయాడు….

 

 

 

శాన్వి మాటలకి అసహనంగా మారుతూ చూడు శాన్వి! నేను మీ మంచికే చెప్తున్నా మీ నాన్న గారు ఎప్పుడు ఎలా ఉండేది తెలియదు.. రేపు ఏదైనా తేడా జరిగితే… ఆ ఇంటి పెద్ద అల్లుడిగా కొడుకు బాధ్యతలు తీసుకొని ఆ కార్యక్రమాలు చేయాల్సింది నేనే అన్నాడు..

 

 

తన తండ్రి చావుని కోరుతున్నాడని అర్ధమయిన శాన్వి! ఒళ్ళు మండిపోయి రాజీవ్ నోట్లో నుండి మాటలు రావడం ఆలస్యం లేచి చటాల్న లేచి చెంప పగిలేలా చాచి పెట్టి ఒకటిచ్చి….  తూ! నువ్వింత చెత్త వెధవ్వి నీచమైన ఆలోచనలు ఉన్నవాడివి అని తెలియక ఇంకా మా అక్క నీతో కాపురం చేస్తోందిరా!!!  ఈ క్షణమే మా అక్కని  తన కూతురిని మా ఇంటికి పంపించేయ్. నా అక్కని, నా అక్కా కూతురిని నేనే చూసుకుంటాను!! అని గర్జించినట్టుగానే చెప్పింది…

 

Premium Premium reading Full story · from ₹69
Sign in to continue