చాలా రోజులు మెసేజ్ లు.. కాల్స్ చేస్తూనే ఉంది.. కృతిక చెప్పిన విధానానికి క్రిష్ ని పడేయడం ఓ ఛాలెంజ్ గా తీసుకుంది కానీ క్రిషవ్ మాటకి ఇంప్రెస్ అయిన శాన్వికి ఫ్రెండ్షిప్ చేయాలి అనిపించి ఎన్ని మెసేజ్ లు కాల్స్ చేసినా రెస్పాండ్ అవ్వలేదు క్రిషవ్….
ఈ విషయం కృతికకి తెలియదు… క్రిష్ తన ఫేక్ ప్రొపోజ్ కి ఒకే చెప్పాక నీ అన్న కూడా అందరి లాంటి మగాడే అని చెప్పాలి అనుకుంది కానీ అక్కడుంది క్రిషవ్ రాజ్!! అలాంటి చిల్లర ముచ్చట్లకి పడే వాడు కాదని మరోసారి నిరూపించుకున్నాడు…
అలా ఓ నెల పాటు మెస్సేజ్ లు కాల్స్ చేసినా అటు నుండి రిప్లై రాక విసిగి పోయి నిజంగానే జెమ్ అనుకుని లైట్ తీసుకుంది శాన్వి…
ఆ తరువాత మళ్ళీ ఎప్పుడు చేయలేదు శాన్విక…