“మీకు ఇంకా పిల్లలు ఉన్నారా శౌర్య కాకుండా.” అని అడిగాడు సుధాకర్ రఘురామయ్యగారిని చూస్తూ.
“శౌర్య కంటే ముందు ఒక ఆడపిల్ల ఉంది, తనకి పెళ్లయింది ఇదే సిటీలో ఉంటుంది.” అని అన్నాడు రఘురామయ్య.
“ఇద్దరు పిల్లల్ని కళ్ళముందే పెట్టుకున్నారా అదృష్టవంతులు.. నేను కూడా మా వేదని మేము ఉండే దగ్గరలోనే ఇవ్వాలి అనుకుంటున్నాం, లేదా వీలుపడకపోతే తను ఉండే దగ్గరకి మేము షిఫ్ట్ అవ్వాలి అనుకుంటున్నాం.” అని అంది సునంద.
“ఈ రోజుల్లో అలాగే ఇవ్వాలి వదిన.. ఎందుకంటే బయట నుంచి వచ్చే పిల్లలు ఎలా ఉంటున్నారో తెలియట్లేదు, మన పిల్లలు మనసులో ఉంది బయటకు చెప్పరు.. కష్టమైనా సుఖమైన ఓర్చుకుంటారు, మనం దగ్గర్లో ఉంటే ఎంతోకొంత ఆసరా అవోచ్చు కదా వాళ్లకి.” అని అంది కౌసల్య.