“నువ్వు కాదురా.. నేనే నీకు సరీ చెప్పాలి, నీకు నేనున్నాను అనే ధైర్యాన్ని ఇవ్వలేకపోయాను అది నా తప్పే.. ఇకముందు నిన్ను తాకడానికి మనుషులు కాదు చీమని కూడా అనుమతి ఇవ్వను, అంత జాగ్రత్తగా చూసుకుంటానమ్మా నిన్ను.” అని అంది కూతురి నుదటి మీద ముద్దు పెట్టుకుంటూ అను తల్లి.
“నీది ఏం తప్పు లేదమ్మా నీకు ఏదైనా చెప్పే స్వేచ్ఛ నువ్వు నాకు ఇచ్చావు.. కానీ..! ఆ టైం కి నాకు భయం వేసింది.
” పెద్దవాడు అయినా బాబాయ్ మాట అందరూ నమ్ముతారు గాని చిన్నపిల్లని కదా నా మాట ఎవరైనా నమ్ముతారో లేదో అని భయం వేసింది,అందులో నాన్న కూడా లేడుగా మనకి పెద్దదిక్కుగా అందుకే ధైర్యంగా చెప్పలేకపోయాను.” అని అంది ఏడుస్తూ అను.
“ఏ విషయమైనా, ఎలాంటి విషయమైనా నిస్సంకోచంగా నా దగ్గర చెప్పు అను.. నువ్వు మనసులో పెట్టుకొని బాధపడుతూ ఉంటే నాకు తెలియదు కదరా..!” అని అంది కూతురిని మళ్లీ దగ్గరకి తీసుకొని కౌగిలించుకుంటూ అను తల్లి.