” మంచి అమ్మాయి, మంచి ఫ్యామిలీ కూడా.. లవ్ అని చెప్పలేను కానీ పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ ఉంది.
” పెళ్లి చేసుకోవాలనే ఆలోచన కలిగింది వేదతో ఈ జర్నీలో, అదే ప్రపోజల్ పెట్టాను తనకి.. పెళ్లి చేసుకుందాము నీకు నచ్చితే, మీ ఫ్యామిలీతో మాట్లాడు అని.
“వాళ్ళ ఫ్యామిలీకి విషయం చెప్పిందంట, అంటే ఎగ్జామ్ రాసాను.. సారీ ఎక్సమ్ రాసింది తను ఇంకా రిజల్ట్ రాలేదు, వాళ్ళ అమ్మ నాన్న ఇంకా ఎస్ ఆర్ నో చెప్పలేదు అదే విషయం చెప్పడానికి కాల్ చేసింది.
” నేను ఇప్పటివరకు అమ్మ వాళ్లకి పిన్ని వాళ్ళకి ఎవరికీ చెప్పలేదు ఫస్ట్ నీకే చెప్తున్నా.. వేద వాళ్ళ పేరెంట్స్ ఎస్ అని చెప్పాక మన ఇంట్లో చెప్దామని ఆగాను బావ.” అని అన్నాడు శౌర్య సాకేత్ ని చూస్తూ.
“ఇంట్లో పెళ్లి బాజాలు మోగబోతున్నాయి అన్నమాట.” అని నవ్వాడు సాకేత్.