ఆగిపోయిన పెళ్లి… ఆసుపత్రిలో ఆందోళన!
వెడ్డింగ్ హాల్ అంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. కొద్దిసేపటి క్రితం పెళ్లి సందడితో కళకళలాడిన ఆ ప్రాంగణంలో ఇప్పుడు తుపాకీ శబ్దం, ఆనందీ అరుపు మాత్రమే ప్రతిధ్వనిస్తున్నాయి.
అమ్మా… అంటూ ఆనందీ రాజేశ్వరి దగ్గరికి పరుగెత్తుకొచ్చింది.
అమ్మా… ఏమైంది అమ్మా? కళ్ళు తెరువు అంటూ ఆమెను పట్టుకుని ఏడవసాగింది.
మురారి కూడా కంగారుగా తల్లి దగ్గరికి వచ్చాడు.
అమ్మా… ఏమైంది? ఎవరు కాల్చారు? అంటూ రాజేశ్వరి తలను తన ఒడిలోకి తీసుకున్నాడు.