తన ప్రాణ సమానుడైన తన భర్త శక్తి కాలి బూడిదైపోయాడనే నిజాన్ని జ్వాల జీర్ణించుకోలేకపోయింది. ఐదేళ్ల పాటు ఆ ఇంట్లో వాళ్లు పెట్టిన మానసిక నరకం, పిల్లలు పుట్టకుండా అన్నంలో విషం కలిపిన ద్రోహం, చివరకు ఇల్లు వదిలి వస్తూ శక్తి వాళ్ళతో పడిన ఘర్షణ .. ఆ తెల్లవారుజామున కారులో టైమర్ బాంబు పేలి శక్తి సజీవ దహనమవడం అన్నీ జ్వాల కళ్ల ముందు కదలాడాయి. హాస్పిటల్స్ చుట్టూ తిరిగి పిల్లలు పుట్టరని తెలిసినప్పుడు శక్తి తనను గుండెలకు హత్తుకుని ఏడ్చిన క్షణాలు గుర్తొచ్చి ఆమె గుండె పగిలిపోయేలా రోదించింది.
కానీ, ఏడుస్తూ కూర్చుంటే తన భర్తను చంపిన శత్రువులు హ్యాపీగా తిరుగుతారని ఆమెకు అర్థమైంది. జ్వాల తన కన్నీళ్లను తూడ్చుకుంది. ఆమె కళ్లల్లో అప్పటివరకు ఉన్న దుఃఖం కాస్తా, ప్రతీకార జ్వాలగా మారింది. “శక్తి.. నీ ఆశయాలను, నువ్వు అహర్నిశలు కస్టపడి స్థాపించిన ఈ js సామ్రాజ్యాన్ని ఆ ద్రోహుల పాలు కానివ్వను. నిన్ను చంపిన వాళ్లను ఈ భూమిపై లేకుండా చేస్తాను” అని శక్తి అస్థికల ముందు ప్రమాణం చేసి చెప్తున్నాను.
శక్తి మరణంపై పోలీసులు ప్రాథమికంగా ఇది కేవలం ‘షార్ట్ సర్క్యూట్’ వల్ల జరిగిన ప్రమాదంగానే భావించి కేసు క్లోజ్ చేయాలని చూశారు. కానీ, జ్వాల ఒత్తిడి మరియు జేఎస్ కార్పొరేషన్ ప్రతిష్ట వల్ల కేసును రీ-ఓపెన్ చేసిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ , జ్వాలను కలవడానికి ఇంటికి వచ్చాడు.
ఆయన టేబుల్ పై తన చేతిలో ఉన్న ఫోరెన్సిక్ రిపోర్ట్‌ను ఉంచి ఒక కీలకమైన క్లూ ని కూడా ఇచ్చాడు:
“మేడమ్, ఇదొక నార్మల్ వైరింగ్ యాక్సిడెంట్ అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఫోరెన్సిక్ ల్యాబ్ నిపుణులు కారు ఇంజన్, ఫ్యూయల్ ట్యాంక్ అవశేషాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అక్కడ ఒక సాధారణ కారు ప్రమాదంలో కనిపించని ‘మెగ్నీషియం మరియు నైట్రో-సెల్యులోజ్’ రసాయనాల జాడలు దొరికాయి. ఈ కెమికల్స్ కేవలం హై-ఎండ్ లిక్విడ్ టైమర్ బాంబుల్లో మాత్రమే వాడుతుంటారు. అంటే మీ భర్త కారు ప్రమాదవశాత్తూ చనిపో లేదు.. ఎవరో కావాలనే టైమర్ బాంబుతో ఆయన్ని చంపేశారు. ఇది వందకు వంద శాతం ప్లాన్డ్ మర్డర్.”
ఈ క్లూ వినగానే జ్వాల చేతులు బిగుసుకుపోయాయి. ప్రసాద్, రుద్రప్పలు ఆడిన నాటకం పోలీసుల ఫోరెన్సిక్ రిపోర్టుతో బయటపడింది.
శక్తి వెనుక నీడలా ఉండే నమ్మకమైన పర్సనల్ సెక్యూరిటీ హెడ్ విక్రమ్ జ్వాల ముందుకు వచ్చాడు. శక్తి మరణించిన రోజున అతను వేరే పని మీద ఉండటం వల్ల శక్తిని కాపాడుకోలేకపోయాననే గిల్ట్ నెస్ అతని మనసును రోజు తొలిచేస్తోంది. కమాండో బ్యాక్‌గ్రౌండ్ ఉన్న విక్రమ్, జ్వాల కాళ్లపై పడి ప్రమాణం చేశాడు.
“మేడమ్, సార్ ప్రాణాలను నేను కాపాడుకోలేకపోయాను. కానీ సార్ ని చంపిన వాళ్లను వదిలే ప్రసక్తే లేదు. పోలీసులు ఇచ్చిన కెమికల్ క్లూ ఆధారంగా నేను రహస్యంగా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాను. మన నగరంలో ఇలాంటి ఇల్లీగల్ కెమికల్ బాంబులు సప్లై చేసే పని కేవలం మైనింగ్ మాఫియా లీడర్ రుద్రప్పకు మాత్రమే ఉంది. పైకి మామూలు గా ఉంటూ వాడు చేసే ఇల్లీగల్ పనులు ఇలాంటి వే.